పల్లవి: బలిపీఠ మెక్కవద్దురా
ఆత్మార్పణ లింకొద్దురా
త్యాగాల చరిత మనదిరా
పొరాడి గెలువసాగరా
జై తెలంగాణ-జై తెలంగాణ
జై తెలంగాణా
"బలిపీఠం"
శ్రీకాంత్ దేహమెందుకు
పెనుమంటలల్లో కాలెను
పోలీస్ కిష్టయ్య తన
ప్రాణ మెందుకిచ్చెను
మల్లేషం మంజులలు భార్యభర్తలయ్య
మూడు పదులు దాటిన ప్రేమ ముర్తులయ్య
ఎన్నేండ్లు వేదనంటూ
మాగుండె కోతనంటూ
ప్రశ్నించెవారి మరణం
ఇక మిశ్రమించలేము
సలాం అమరులారా-సలాం అమరులారా
సలాం అమరులారా ........
"బలిపీఠం"
డిసెంబర్ తొమ్మిదొక
చీకటి రోజందుమా
పదకొండు గురి త్యాగపు
వెలుగు రేఖ లందుమా
విశ్వవిద్యాలయాల విద్యర్థుల పిడికిల్లు
వీధులన్ని అట్టుడికిన ప్రజా పోరు కెరటాలు
ఉరికొయ్య తీగవద్దు
పోరాటమాపవద్దు
పార్లమెంటు బిల్లుదాక
సల్లారదు మాకాక
సలాం అమరులారా-సలాం అమరులారా
సలాం-అమారులార......
"బలిపీఠం"
Monday, December 21, 2009
Subscribe to:
Post Comments (Atom)
jai telangana-jai jai telangana....amar anna!jara siricilla,vemulawadalalo docterla anaitika practice,anavasara oprationlanu aapincharaadE...poor people bhaagu padataaru.
ReplyDeleteతెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష, హక్కు తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ సాధన కోసం సాగుతున్న ఉద్యమంలో ఉద్వేగాలను ఉద్రేక పరిచి మరణం వైపు నెట్టే నాయకుల పట్ల హెచ్చరికగా ఉండడం చాలా అవసరం. ఈ బాధ్యతను సాహిత్య కళా రంగాలకు చెందిన వారు స్వీకరించాలి. ఒక రచయితగా, ఒక జర్నలిస్టుగా నేను తెలంగాణ సాధన ఉద్యమాన్ని సంపూర్ణంగా సమర్ధిస్తున్నాను. సంఘీభావం ప్రకటిస్తున్నాను.
ReplyDelete-ఆర్ ఎం ఉమామహేశ్వరరావు