Tuesday, December 22, 2009

కసబ్ ని మరిపించిన రాజగోపాల్ - కేసీఆర్


విజయవాడ లో మాయం అయ్యి హైదరాబాద్ నిమ్స్ లో ప్రత్యక్ష్యమైన లగడపాటి రాజగోపాల్ ను ముంబై మీద దాడి చేసిన అజ్మల్ కసబ్ తో పోల్చారు తెరాస అధినేత కేసీఆర్, ఈ విషయాన్ని తన సహచరుడు విజయరామారావు తనతో అన్నారని తెలంగాణ భవన్ నుండి చేసిన ప్రసంగం లో పేర్కొన్నారు.

నా దిష్టి బొమ్మలు ఇంకా తగలబెట్టండి: కేసీఆర్

సీమాంధ్ర లో తన దిష్టి బొమ్మల దహనం పై తెరాస అధినేత స్పందించారు. తన దిష్టి బొమ్మలు ఇంకా పెద్ద ఎత్తున తగలబెట్టాలని, దానితో తనకు ఉన్న దిష్టి పోయి ఆయుషు పెరుగుతుందని అన్నారు.

సమైక్యాంధ్ర ఎందుకు కావాలి అని ఆందోళనకారులను అడిగితే వారి దగ్గర జవాబు లేదన్నారు. వారికి తెలిసిన జవాబు అస్తమానం కేసీఆర్ డౌన్ డౌన్, దిష్టి బొమ్మలు తగలబెట్టాడమే అని ఎద్దేవా చేశారు.

త్వరలో: తెలంగాణనౌ.కామ్

Monday, December 21, 2009

లగడపాటి పరుగు పందెం



సలాం అమరులారా - మిత్ర (అమర్)

పల్లవి: బలిపీఠ మెక్కవద్దురా
ఆత్మార్పణ లింకొద్దురా
త్యాగాల చరిత మనదిరా
పొరాడి గెలువసాగరా
జై తెలంగాణ-జై తెలంగాణ
జై తెలంగాణా
"బలిపీఠం"
శ్రీకాంత్ దేహమెందుకు
పెనుమంటలల్లో కాలెను
పోలీస్ కిష్టయ్య తన
ప్రాణ మెందుకిచ్చెను
మల్లేషం మంజులలు భార్యభర్తలయ్య
మూడు పదులు దాటిన ప్రేమ ముర్తులయ్య
ఎన్నేండ్లు వేదనంటూ
మాగుండె కోతనంటూ
ప్రశ్నించెవారి మరణం
ఇక మిశ్రమించలేము
సలాం అమరులారా-సలాం అమరులారా
సలాం అమరులారా ........
"బలిపీఠం"
డిసెంబర్ తొమ్మిదొక
చీకటి రోజందుమా
పదకొండు గురి త్యాగపు
వెలుగు రేఖ లందుమా
విశ్వవిద్యాలయాల విద్యర్థుల పిడికిల్లు
వీధులన్ని అట్టుడికిన ప్రజా పోరు కెరటాలు
ఉరికొయ్య తీగవద్దు
పోరాటమాపవద్దు
పార్లమెంటు బిల్లుదాక
సల్లారదు మాకాక
సలాం అమరులారా-సలాం అమరులారా
సలాం-అమారులార......
"బలిపీఠం"

Saturday, December 19, 2009

తెలంగాణ ధూం ధాం(ఓల్డ్): గద్దర్, రసమయి, అందెశ్రీ, దేశపతి

తెలంగాణ కు పట్టిన తెగులు తెలుగుదేశం పార్టీ

ఆయన పేరు నాగం జనార్ధన్ రెడ్డి, ఇప్పుడు పార్టీలో నంబర్ టూ(?) అని అంటారు. కాంగ్రెస్ వాళ్ళు, గిట్టని వాళ్ళు బియ్యం రెడ్డి అని కూడా అంటారు. అపుడెప్పుడో తన పెళ్లి పత్రిక పై జై తెలంగాణ అని ముద్రించుకున్నాను అని ఎప్పుడు డబ్బా కొడుతూ ఉంటారు. ఇక ఇంకో మహా నాయకుడు, నిన్నటి వరకు తెదేపా లో నంబర్ టూగా ఉన్న తూల్ల దేవేందర్ గౌడ్ తెలంగాణ కోసం ప్రత్యేక పార్టీ పెట్టిన ఘనత. ఇంకా మిగత నాయకులు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర రావు పొద్దున లేస్తే తెలంగాణ జపం. ఒకరిని మించిన నేపథ్యం ఒకరిది . కాని నేడు ఒక్కరూ అంటే ఒక్కరూ కూడా తెలంగాణ పై మాట్లాడటం లేదు. పార్టీ నుంచి బయటకి రావటం అటుంచి కిక్కూరు మనటంలేదు. అది వారు నాయకుడికి చూపిస్తున్న విధేయత అనుకుంటున్నారు. కానీ అదే నాయకుడి ఆంధ్ర, రాయలసీమ అనుచరగణం చంద్రబాబు ని లెక్కచేయకుండా రోడ్ల వెంట పడి బస్సు యాత్రలు చేస్తున్నారు. ఇది సీమంధ్ర నాయకుల తిరుగుబాట? లేక తెలంగాణ తెలుగు దేశం నాయకుల చేతకాని తనమా?? లేక తెలంగాణ ప్రజల దౌర్బాగ్యమా ???

1983 లో తెలుగువాడి ఆత్మ గౌరవం అంటూ సినిమా ఫక్కిలో వచ్చిన పార్టీ ఇది. తెలంగాణ వాదాన్ని వినిపించనీయకుండా రకరకాల డ్రామాలు చేసిన పార్టీ ఇది. తన తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ అనే పదం ఉచ్చరించనీయకుండా చేసిన నిరంకుశ నాయకుడు చంద్రబాబు. అయిదేళ్ళు అధికారానికి దూరమవటంతో ఇష్టం లేకున్నా 2009 లో తెలంగాణ పల్లవి అందుకున్న నయవంచక నాయకుడు చంద్రబాబు. ఒకపక్క సీమంధ్ర నాయకుల దీక్షలను, బస్సు యాత్రలకు నిర్దేశన చేస్తూ మరోపక్క తెలంగాణ ప్రజలను తనకు వచ్చిన మోసపు విద్య ను ప్రదర్శిస్తున్నాడు.

అయితే ఈరోజు నాయకుడిని లెక్క చేయకుండా రాజీనామాలు చేసిన తెలంగాణ భూమి పుత్రులు రేవూరి ప్రకాష్ రెడ్డి, గంగుల కమలాకర్, చెన్నమనేనీ రమేష్ లను చూసి మిగత నాయకులు బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది. తెలంగాణ ఓట్లతో గెలిచిన, గెలవాలనుకున్న తెలంగాణ 'తెగులు' దేశం నాయకులు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు నేటి తెలంగాణ ప్రజలు.

విజయశాంతి కనబడుట లేదు

మీడియా వివక్ష కు ఇంకో నిదర్శనం

చిరంజీవి తెలంగాణ పై మాట మార్చినందుకు కలత చెంది పీఆర్‌పీ కార్యకర్త కొమరా రెడ్డి(చిరంజీవి అభిమాని) ఆత్మహత్య చేసుకుంటే స్క్రాలింగ్ మాత్రమే వేసి, చిత్తూరు లో సమైక్య ఉద్యమానికి మద్దతుగా ఆత్మహత్య చేసుకున్న యువకుని వార్తను బ్రేకింగ్ న్యూస్ గా వేస్తున్న దృశ్యం ఈ క్రింద చూడవచ్చు.

టీవీ9 లో కేసీఆర్ - కొశ్చన్ హవర్







Friday, December 18, 2009

సేవ్ తెలంగాణ లో పాల్గొన్న ప్రవాసుల అరెస్ట్

రాష్ట్రం పేరును తెలంగాణ గా మార్చినా అభ్యంతరం లేదు - లగడపాటి

రాష్ట్రం పేరును తెలంగాణగా మార్చినా అభ్యంతరం లేదు అని ప్రకటించిన లగడపాటి రాజగోపాల్ ను చూస్తే నవ్వాలో ఎడ్వాలో తెలియటంలేదు. ఆంధ్ర - తెలంగాణ లను కలిపినప్పుడు రాష్ట్రం పేరు తెలంగాణాంధ్ర ప్రదేశ్ గా ఉంచాలని ఇక్కడ నిర్ణయించి ఢిల్లీ కి వెళ్లేసరికి పేరు మార్చి పారేసీన ఆంధ్ర నాయకులకు వారసుడైన లగడపాటి ఇంకో కుట్రకు తెరలేపాడు. తిమ్మిని బమ్మి చేసయినా రాష్ట్ర ఏర్పాటు ను ఆపాలని లగడపాటి లాంటి నాయకుల ఆరాటం చూస్తే నవ్వొస్తుంది.

మ్యూజిక్ సిట్టింగ్: సమైక్యాంధ్ర కొత్త గోడలెందుకుయ్య కడ్తవు....

తెలంగాణ పై మీడియా కు చిన్న చూపు ఎందుకు ?

ఏ ఉద్యమానికైన మీడియా సహకారం అత్యంత కీలకం. పత్రికలు, టీవీ ఛానళ్లు, వెబ్ సైట్లు పుంఖాను పుంఖాలుగా పుట్టుకొచ్చిన నేటి తెలుగు సమాజంలో తెలంగాణ ఉద్యమం పట్ల ఉన్న వివక్ష అందరికి తెలిసిందే. దీనికి ముఖ్య కారణం తెలంగాణ కు చెందని మీడియా సామ్రాజ్యం. ఒకటి అరా చానళ్లు, పత్రికలు ఈ ప్రాంతానికి చెందిన వారివైనా... వారు ఉద్యమానికి తోడ్పడుతున్న పాత్ర పరిమితం అని చెప్పవచ్చు. రాగ ద్వేషాలకు, పక్షపాతానికి అతీతంగా వ్యవహరించవలసిన మీడియా స్వప్రయోజనాలకు, ప్రాంతాభిమానానికి దాసోహం అయిపోయింది. తెలంగాణ వస్తే తమ ప్రయోజనాలకు భంగం కలుగుతుందనే భయమే ఈ వివక్షకు ప్రధాన కారణం. వివక్ష ఉంది అనటానికి రెండు చిన్న ఉదాహరణలు.

1. చిరంజీవి సమైక్యవాద గళం విప్పగానే అతని అల్లుడు శిరీష్ భరద్వాజ్ తెలంగాణ కు జై అనటం మీడియాలో స్క్రోలింగ్ కొన్ని నిమిషాలు తప్ప ఎక్కడా వార్తలు రాలేదు. అదే లగడపాటి కి మద్దతు గా విజయవాడ శిబిరానికి వచ్చిన వరంగల్ యువకుడిని హైలైట్ చేశారు.
2. కేసీఆర్ నిరాహార దీక్ష మీద అవాకులు చెవాకులు మాట్లాడి ఆర్భాటంగా ప్రకటించి తిరుపతిలో చేపట్టిన 'ఒక పూట' దీక్షను మధ్యాన్నం మూడింటికే ముగించి శిబిరంలో నిరుత్సాహం నింపిన మోహన్ బాబు గురించి కూడా ఎక్కడా వార్త రాలేదు. పైగా మోహన్ బాబు విసిరిన 'ఇంటి మీద రాళ్లు వేయించుకునే' సవాలుకు ప్రాముఖ్యం ఇచ్చారు. ఇవి రెండు చిన్న ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి కోకొల్లలు.

ముఖ్యమంత్రి మొదలుకుని ప్రభుత్వ,పాలనా యంత్రాంగం అన్ని(దాదాపు)పార్టీలు చూపిస్తున్న వివక్షకు తోడు నిస్వార్థం గా ఉండాల్సిన మీడియా కూడా వీరికి తోడవటం సగటు తెలంగాణ పౌరుడి మనస్సు చివుక్కుమంటుంది.

చంద్రబాబు యూస్ అండ్ త్రో కింగ్: కేసీఆర్

Thursday, December 17, 2009

కోస్తా వాళ్ళు దొంగలు: కత్తి పద్మా రావు (ఓల్డ్ వీడియో)

ఓ తెలంగాణ వాడి ఆవేదన

పదండి ముందుకు పదండి ముందుకు మన రాష్ట్ర పునర్ నిర్మాణానికి
బంగారం లాంటి మన తెలంగాణ గుడిసెను, బంగళాలగ మారుస్తమని
మనల్ను బజారులొ ఎమి చేయలేని వాళ్ళను చేసారు
తెలంగాణ ప్రజలు కోస్తా రాయలసీమ నాయకుల జిత్తులకు ఎత్తులు వేసే మొగుళ్ళు
నలబై సంవత్సరాల జి .ఓ లను పండ బెట్టి
రాత్రికి రాత్రి ఎన్ని కోర్టులు చెప్పిన వినకుండా
జి.ఓ లు లేని ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు
అధికార అహంకారముతొ మా నీళ్ళను మరియు అన్ని వాటాలను తీసుక వెల్తున్నారు
నాడు ఒకడు, నేడు ఒకడు, రేపు మరొకడు ఏన్నాల్లు ఇలా
ఇదేనా సమ న్యాయం అంటే
నిజం మాట్లాడమంటె నా తెలుగు అన్నదమ్ములు అంటారు
ఒక్క తల్లి బిడ్డలం అంటారు
తెలంగాణ రక్తం ఆత్మల పుట్ట
తెలంగాణ తల్లి సవితి బిడ్డను తన బిడ్డగా భావించె తల్లి
ఎక్కడరా సమైక్య, ఎవడురా సమైక్య అనేది
ఎన్నాల్లు ఈ ద్రుతరాష్ట్ర పాలన మాకు
ఇన్నిరోజుల ద్రుతరాష్ట్ర పాలనకు నిదర్షనం
ఆర్ధికంగా లేని మా తెలంగాణ ఎం.ఎల్.ఏ మరియు ఎం.పి లను లొంగదీసుకొవడం
ఆంధ్ర ప్రదేశ్ లో ఏ పదవికి ఛివరికి
ఏ కుల సంఘం పెద్దమనిషి తనానికి అర్హత లేదా మాకు
నాడు నిజాముకు నేడు నీకు గులాంగిరికేన మేము పుట్టింది, పుట్టేది
ఫుట్టారు నీ ఎత్తులకు పై ఎత్తులు వేసే " చంధ్ర శేఖరా" “మధు” కుసుమాలు
కలుస్తాం మేము అందరం ఒక్క తాటిపై
మసులుతుంది మా యువ రక్తం
కదులుతుంది సమర శంఖం చూడురా తెలంగాణ వాడి దెబ్బ

త్వరలో మన తెలంగాణ రాష్ట్ర పునర్ ఏర్పాటు అనే చిన్ని ఆశ నెరవేరుతుంది అని ఆశిస్తూ………

-అజయ్ తిప్పని

పార్లమెంట్ ఆవరణ లో తెలంగాణ - సీమాంధ్ర సభ్యుల వాగ్వాదం

అమరజీవిని అవమానించకండి

మన తెలంగాణ వాళ్ళు ముందు జేసేది ఎనక, ఎనక జేసేది ముందు చేస్తుంటారు.దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాల ధ్వంసం,వాటిని అవమానించడం.ఇంతకాలం హైదరాబాదులోనే అమరజీవి విగ్రహాలున్నాయనుకున్నా, కాని ద్వంసమైన విగ్రహాల వార్తలు చూస్తుంటే తెలంగాణ జిల్లాలోకూడా వారి విగ్రహాలున్నట్లు తెలుస్తున్నది. మద్రాసు రాజధానిగా కలిగిన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకొరకు (వేర్పాటు కొరకు) ఆమరణ నిరాహార దీక్షపూని అసువులు బాసి అమరజీవి ఐనారు శ్రీరాములుగారు. ఐతే ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పాటయ్యి 1956 డిశంబర్ వరకు కొనసాగింది, కాని మద్రాసును రాజధానిగా సాధించలేకపొయ్యింది.సరే ఆ విషయం అట్ల ఉంచుదాం.అమరజీవి విగ్రహాలను తెలంగాణవాదులు చెప్పులతో అవమానించడం,వాటిని ధ్వంసం చెయ్యడంలో హేతుబద్ధతను విష్లేంచి అర్ధం చెసుకుందాం.ఏమాత్రం తెలంగాణలో జరిగిన మంచి,చెడు పాలనకు గాని,ఆపాలన వల్ల తెలంగాణ వారికి జరిగిన కష్ట-సుఖాలకుగాని లేదా వారి లాభ నష్టాలకు గాని శ్రీరాములు గారికి సంబంధం లేదు. అసలు ఆయన చనిపోయిన పిదప కదా! ఆ.ప్ర. రాష్త్రం ఏర్పడింది,కనుక అమరజీవి ఈతెలంగాణ ప్రాంతానికి నష్టమూ చెయ్యలేదు,లాభమూ చెయ్యలేదు.

- Ramulu

తెలంగాణ ఏర్పాటు జరిగిపోయింది: కేసీఆర్ ప్రెస్ మీట్

Part I - ETV - 8:41


Part II - TV5 - 9:52


Part III - TV5 - 9:54


Part IV - NTV - 10:05


Part V - NTV - 10:00

జెండాలు వేరు కాని అజెండా ఒక్కటే !

అంతా ఒక్కటయ్యారు ! నీతి, నియమాలు, పార్టీ, జండా, వర్గం అన్ని పక్కన పెట్టి అంతా ఏకమయ్యారు. అదీ... ౫౦ ఏళ్ల నుంచి జరుగుతున్న ఒక పోరాటానికి వ్యతిరేఖంగా అంతా ఒక్కటయ్యారు. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు, జగన్, దివాకర్ రెడ్డి, చిరంజీవి, మోహన్‌బాబు, లగడపాటి, దేవినేని, జయప్రకాష్ నారాయణ, రాఘవులు ఇలా ఒకదానికొకటి పొంతన లేని పేర్లు. ఒకరిని చూస్తే ఇంకొకరికి జీవిత కాలపు శతృత్వం, అయినా కూడా పాలు నీళ్ళు లాగా కలిసి పోయారు. సాటి తెలుగు వారు అంటూనే తెలంగాణ వారి అర్ధ శతాబ్దపు అపరిష్కృత కల నెరవేరుతుంటే మొకాలడ్డుతున్నారు. చందమామ కథల్లోని సమైక్య భావన ఫార్ములా తీసుకు వచ్చి ఆంధ్ర సాధారణ ప్రజలను చిన్నపిల్లలు చేసి రెచ్చగొడుతున్నారు.

అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం అన్న కాంగ్రెస్, తెలంగాణ కు మేము అనుకూలం, బిల్లు పెడితే సహకరిస్తాం అన్న చంద్రబాబు, సామాజిక తెలంగాణ అన్న చిరంజీవి ఇలా ఒకళ్ళని మించి ఒకళ్ళు ఈరోజు పచ్చి దగాకు సిద్ధపడ్డారు. తెలంగాణ వస్తే నీళ్ళు రావు, సజ్జన్నమె తీనాల్సి వస్తుంది, ఉద్యోగాలు రావు, హైదరాబాద్ లో పరాయి వాళ్ళం అవుతాము అని అర్ధ సత్యాలు, అసత్యాలు ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటున్నారు. కానీ ప్రజలంతా అమాయకూలేమీ కాదు. భిన్న ధ్రువాలు అయిన రాజకీయ వ్యభిచారులు ఎందుకు కలిసి పోయారో ఊహించగల విజ్ఞులు నేటి ప్రజలు. అయితే వీరిని చూస్తే ఒకటి అనాలనిపిస్తుంది, అదే భిన్నత్వంలో ఏకత్వం వీరి సమైక్యం. జెండాలు వేరు కాని అజెండా ఒక్కటే !

తెలంగాణ కు మోహన్ బాబు సవాల్

Wednesday, December 16, 2009

మెగా స్టార్ కాదు దగా స్టార్

నిన్నటి వరకు సామాజిక తెలంగాణ అంటూ చిలక పలుకులు పలికిన హీరో చిరంజీవి నేడు ప్లేట్ ఫిరాయించాడు. తెలంగాణ ప్రజల హృదయాల్లో గత ఇరవై ఏళ్లుగా మెగాస్టార్ గా వెలిగిన చిరంజీవి నేటి తో దగాస్టార్ అయిపోయాడు. ఏ హీరో కు ఇవ్వని స్థానాన్ని తెలంగాణ ప్రజలు తనకు ఇచ్చినా ఈ ప్రాంత ప్రజల ఆశలను వమ్ము చేశాడు.తెలంగాణ లో సరైన బలం లేదని ఎన్నికలు జరిగిన ఇన్నాళ్లకు తెలుసుకున్న చిరంజీవి మొత్తానికి సమైక్యాంధ్ర రైలెక్కెసాడు. ఇన్నాళ్లు తన మనస్సాక్షి ని ఛంపుకుని నటిస్తూ వచ్చిన చిరంజీవి ఈరోజుతో తన మెకప్‌ను తీసివేసాడు.

ఈ దెబ్బతో తెలంగాణ లో ఉన్న ఇద్దరు ఉన్న బాల్కొండ ఎమ్మెల్యే అనిల్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ ‌రెడ్డి లాంటి నాయకులు రాజీనామా చేశారు. వీరితో పాటు నారగోని లాంటి రాష్ట్ర స్థాయి నేత మరియు అనేక మంది జిల్లా స్థాయి నేతల రాజీనామాల తో తెలంగాణ ప్రజారాజ్యం ఖాళీ అయింది. ఇక తెలంగాణ జేఏసీ చిరంజీవి కుటుంబపు సినిమాలను ఆడనివ్వమని ప్రకటించారు. అంతేకాకుండా ఆర్య-2 సినిమా ఆడుతున్న థియేటర్లను మూసివేయించి కటౌట్లను, పోస్టర్లను ఛింపివేశారు.

చంద్రబాబు, జగన్, చిరంజీవిల మరుగుజ్జుతనాన్ని బయటపెట్టిన కేసీఆర్

Tuesday, December 15, 2009

మేము రాష్ట్రాన్ని మాత్రమే అడుగుతున్నాం, స్వతంత్ర దేశం అడగటం లేదు.....

మేము రాష్ట్రాన్ని మాత్రమే అడుగుతున్నాం, స్వతంత్ర దేశం అడగటం లేదు. స్వరాష్ట్ర డిమాండ్ రాజ్యాంగం కల్పించిన ఒక న్యాయబద్దమైన హక్కు. 60 సంవత్సారాల ఆధిపత్యం నుంచి బయట పడాలనే ఒక ఆరాటం. మా రాష్ట్రాన్ని మేము పాలించుకుంటామనే ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష. అది కూడా ఉన్న రాష్ట్రాన్ని పునరుద్ధరించమనే అడుగుతున్నారు ఈ ప్రాంత ప్రజలు. సమైక్య రాష్ట్రం లో మాకు న్యాయం జరగదని 50 సంవత్సరాలు వేచి చూశాకే జరుగుతున్నది ఈ ఆందోళన. దయచేసి మా పోరాటాన్ని, మా కోరిక ను చులకన చేయొద్దు. మా బలీయమైన ఆకాంక్ష ను తక్కువ చేయొద్దు. ఇక చరిత్ర లోకి వెళితే...

1953 లో మాకు ఇష్టం లేకున్నా రాష్ట్రాన్ని ఏకం చేసి అయిదు సంవత్సరాల గడువు పెట్టిన ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పెద్ద మనుషుల ఒప్పందాన్ని ప్రతిపాదించారు. అది అలా ఢిల్లీలో ప్రకటించి ఆనాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ వచ్చే సరికి తూట్లు పొడిచారు. ఆ ఒప్పందం ప్రకారం ఉప ముఖ్యమంత్రి పదవి ని తెలంగాణకు ఇవ్వాల్సి ఉండగా దాన్ని ఆరో వేలు అంటూ కొట్టి పారేసీన ఆంధ్ర పాలకుల అహంకారానికి తొలి అడుగు అక్కడే పడింది. దీనికి తెలంగాణ నాయకుల చేతకానితనం తోడయ్యింది.



ఆ తరవాత వరస మోసాలు, ఆరు సూత్రాల పథకాన్ని కూడా పదహారో వేలు కింద తీసి పారేశారు. 1985 లో 610 జీవో అయితే రాష్ట్రంలో అమలు కాకుండా మరుగున పడి ఉన్న అతి పురాతన జీవో. ఇంకా కొన్ని రోజుల్లో ఈ జీవో గిన్నిస్ బుక్ లో కి ఎక్కిన ఆశ్చర్యపోనవసరం లేదు. వీటన్నింటికి తోడు కొత్తగా హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే కొత్త కుట్ర కు తెర లేపారు. అరాచకాలు ఎక్కువ కాలం భరించ లేరు అన్న విధంగా దీనితో 40 ఏళ్లకు మళ్లీ ఒకసారి విప్లవం వచ్చింది. కేసీఆర్ నిరాహార దీక్షను తక్కువ అంచనా వేసి ప్రభుత్వం దెబ్బ తిన్నది. ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా ఆగ్రహానికి భయపడి తెలంగాణ పై ప్రకటన చేసింది.

దీనితో ఇంకొక కొత్త డ్రామాకు తెర లేచింది. అప్పటి వరకు ఉప్పు నిప్పు అన్న చందాన ఉన్న నాయకులు, తెలంగాణ ఎక్కడ ఏర్పడుతుందో తమ దోపిడీ కి ఎక్కడ తెర పడుతుందో అని పాంట్లు, పంచెలు ఎగ్గట్టి రంగంలోకి దూకారు. అర్ధరాత్రి నిర్ణయం పేరు మీద తెల్లారే సరికి పోటీలు పడి రాజీనామాలు చేసి ఆ తరవాత జనాలను రోడ్ల మీదకు లాగి దాన్నే ప్రజా ఉద్యమం గా మలచాలని ప్రయత్నించటం చూస్తుంటే నవ్వొస్తుంది. రాజీనామాలు చేసిన కొన్ని గంటలకు గాని తేరుకొని సామాన్య జనం ఈ ఉద్యమాన్ని తమ ఖాతా లోకి నెట్టేసరికి పాలు పోక వాళ్ళూ రోడ్డెక్కారు. ఇక సమైక్యం సమైక్యం అంటూ ఏకపక్షంగా కురిపించే ప్రేమ కు తెలంగాణ ప్రజలు ఖంగు తింటున్నారు.



ఇక ఈ ఉద్యమాన్ని(?) హైజాక్ చేయడానికి పోటీలు మొదలయ్యాయి. లగడపాటి నుంచి జగన్ వరకు, దివాకర్ రెడ్డి నుంచి వివేకానందరెడ్డి వరకు పోటీలుపడి రాజీనామాలు, ధర్నాలు , నిరాహారదీక్షలు మొదలు పెట్టేశారు. అయితే ప్రజలు ఇవేమీ తెలియని పిచ్చి వాళ్ళు కారు. వాళ్ళు మౌనంగా ఉన్నంతసేపే మంచి వాళ్ళు. అయితే సగటు సీమాంధ్ర పౌరులకు తెలంగాణ వేరు పడినా, మళ్లీ తెల్లవారి పాలనలోకి వెళ్ళినా తేడా ఏమీ ఉండదు. వచ్చిన చిక్కల్లా కంత్రి, కుహాన, కరడు గట్టిన సమైక్య రాజకీయ నాయకులతోనే....

సమజైతే సలాం లేకుంటే రాం రాం !

వీళ్ళను ఏమనాలి ?

మాకు ఇష్టం లేదు మొర్రో అంటుంటే సమైక్యం అంటూ తమ భావాలను ఎదుటి వారిపై రుద్దుతున్న వారిని ఏమనాలి?
అర్థ శతాబ్దపు అరాచకాన్ని బ్రద్దలు చేసే అవకాశం వచ్చిందనుకుంటే కలిసి ఉంటే కలదు సుఖం అని నీతి సూక్తులు బోధించే వారిని ఏమనాలి ?
తమ వ్యాపార అవసరాలకు సమైక్యం అనే ముసుగు ను తొడుగుతున్నవారిని ఏమనాలి ?
పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రాజకీయ వైరి పక్షాలు నిస్సగ్గుగా, నిర్లజ్జగా ఒక్కటై భూజాలు రాసుకుంటుంటే ఏమనాలి?
మీతో కలిసి ఉండటం మా వల్ల కాదు అని అంటున్నా సిగ్గు రాని జన్మలను ఏమనాలి?
మా చావు మేము చస్తాం అని అంటున్నా గబ్బిలాల్లాగా ఈ ప్రాంతాన్ని పట్టుకుని వేలాడుతుంటే ఏమనాలి?
పై వాటన్నింటికి ఏమానాలో మీరే చెప్పండి.

Friday, December 11, 2009

బాధా ప్రయుక్త రాష్ట్రం లో సమైక్య ముసుగు

నేడు రాష్ట్రంలో చాలా మంది నోటి నుంచి వినిపిస్తున్న మాట సమైక్యాంధ్ర ! సమైక్యం అన్న పదానికి అర్థం తెలుసో లేదో కానీ అంతా మాట్లాడుతున్నపడికట్టు పదం సమైక్యాంధ్ర. లేదా అందరు మాట్లాడుతున్నారు మనము మాట్లాడదామని అనుకుంటున్నారో తెలియదు. ఇక వీళ్ళు మాట్లాడుకునే సమైక్యానికి అర్థ మెంటో చూద్దాం.

సమైక్యాంధ్ర అంటే తోటి తెలంగాణ వాడిని బాష పేరుతో అవమానించటమా ?
సమైక్యాంధ్ర అంటే నీళ్ళ దోపిడీ చేసి సాటి సోదరులను దగా చేయటమా ?
సమైక్యాంధ్ర అంటే సినిమాలలో కమెడియన్లకు విలన్ల కు తెలంగాణ యాస పెట్టడమా?
సమైక్యాంధ్ర అంటే న్యాయంగా రావలిసిన ఉద్యోగాలను తన్నుకుపోవటమా ?
సమైక్యాంధ్ర అంటే నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు, వనరులు, పత్రికలు, చానళ్ళు ఇలా ప్రతి రంగంలో వివక్ష చూపటమా?
లేదా సమైక్యాంధ్ర అంటే బలహీనంగా కన్పించే సాటి తెలుగు వాడిని ఎక్కి తోక్కేయడమా?

అయితే 1969 కి ఇప్పటికీ ఒక స్పష్టమైన తేడా ఉంది. 69 ఉద్యమం తరవాత జై ఆంధ్ర ఉద్యమం చేసిన ఆంధ్రులు ఇప్పుడు విచిత్రంగా సమైక్యాంధ్ర జండా పట్టుకున్నారు. దీనికి కారణం సుస్పష్టం, ఒకటి రాజకీయ నాయకులు, రెండవది పారిశ్రామిక వేత్తలు అయితే మూడవది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు. హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందాక వదులుకోవటం ఎవరికి మాత్రం ఇష్టము ఉంటుంది చెప్పండి.

ఏది ఏమైనా బాషా ప్రయుక్త రాష్ట్రం పేరుతో ఒక్కటి చేసినప్పటి నుంచి మొదలైన కష్టాలు అర్థ శతాబ్దం దాటిన తీరటం లేదు. తీరే సమయం వచ్చింది అనుకుంటే కిరికిరి మొదలైంది. మరి దీన్ని బాషా ప్రయుక్త రాష్ట్రం అనాలో లేదా బాధా ప్రయుక్త రాష్ట్రం అనాలో తెలియదు. జై హో సమైక్యాంధ్ర !

బాబూ ఆనాటి బాసలు ఏమయ్యాయి?

హైదరాబాదే తెలంగాణ రాజధాని !

Thursday, December 10, 2009

ఆంధ్ర లో హాస్టళ్ళు, మెస్ లను మూసేస్తారా ?

తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు మద్దతు ఇస్తున్నారని కాలేజీలు, హాస్టళ్లను, మెస్ లను మూసివేసి వారిపై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం నేడు ఆంధ్ర లో వివిధ యూనివర్సిటీ లలో జరుగుతున్న ధర్నాలు,నిరసనలు,విధ్వంసాలను కూడా అలాగే ఎదుర్కొంటారా అన్నది సగటు తెలంగాణ పౌరున్ని వేధిస్తున్న ప్రశ్న.

యూనివర్సిటీలలో పోలీసులు కదం తొక్కి లాఠీలతో చితక బాదిన సంగతి ఇప్పట్లో మనసున్న వారు ఎవరు మరిచిపోరు. హోం శాఖ మంత్రి తెలంగాణ ప్రాంతానికే చెందినదైనా టోపీ మాత్రమే సబితకు ఉంచి లాఠీ మాత్రం లాక్కున్న సంగతి తెలిసిందే. మానవ హక్కులను కాలరాచి కోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టిన ప్రభుత్వం మరి నేడు ఆంధ్రలో జరుగుతున్న సంఘటనల పై ఎలా స్పందిస్తుందో చూడాలి.

తెలంగాణ: ఎన్డీటీవి చర్చ

దగా పడ్డ తెలంగాణ

Wednesday, December 9, 2009

మెదక్ డీఎస్పి నలిని కి తెలంగాణ సాల్యూట్

తెలంగాణ కు శుభ పరిణామాలు

నేడు (బుధవారం నాడు) ఒక్క కేసీఆర్ ఆరోగ్యం మినహా అనేక శుభపరిణామాలు జరిగాయి. అవి.....

  • పార్లమెంట్ లో తెలంగాణ ప్రకంపనలు: తెలంగాణ పై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని మెజారిటీ పార్టీలు ప్రభుత్వాన్ని కోరాయి. అద్వానీ ప్రవేశ పెట్టిన తెలంగాణ అంశం పై చర్చ జరిగింది. ఒకటి రెండు పార్టీ లు మినహా అందరు తెలంగాణ కు అనుకూలంగాను కేసీఆర్ దీక్ష విరమించాలని కోరారు.
  • కొపెన్ హేగన్ నుంచి తిరిగి వచ్చిన ప్రధాన మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
  • కాలేజీలను, హాస్టళ్లను మూసివేయడాన్ని హై కోర్టు తప్పు బట్టింది. వెంటనే తిరిగి తెరవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రేపు జరగనున్న శాంతి రాలీ కి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపై విద్యార్థులు అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేయు లో విద్యార్థులు పాటలు పాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
  • ఈరోజు మధ్యాన్నం తరవాత సోనియా గాంధీ కోర్ కమిటీ సమావేశం జరపాలని నిర్ణయం.
  • ఎట్టకేలకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు నోరు తెరిచారు. జానా రెడ్డి, దామోదర్ రెడ్డి ల నాయకత్వం లో 29 మంది ఎం ఎల్ ఏ లు సంతకాలు చేసి సోనియా కు ఉత్తరం రాశారు. అలాగే రేపు జరిగే శాంతి యాత్రకు తమ మద్దతు తెలిపారు.
  • నగరానికి చెందిన విష్ణు, శంకర్ రావు, కొండ సురేఖ లు సంతకాలు చేయగా దానం, ముఖేష్, మర్రి, భట్టి తదితరులు సంతకాలు చేయలేదు. తెలంగాణ కు చెందిన 10 మంది మంత్రులు ఇదివరకే సోనియాకు నివేదించుకున్న సంగతి తెలిసిందే.
  • ఈటెల రాజేందర్, హరీష్ రావుల నాయకత్వంలో తెరాస ఎంఎల్ఏ లు శాసన సభ ను స్తంభింప చేశారు. తరవాత గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు, వీరికి బిజెపి, పీఆర్‌పీ, సీపీ ఐ లు మద్దతు పలికారు.
  • ఏబీవీపీ విద్యార్థులు శాసన సభ ను మెరుపు ముట్టడి చేశారు. చివరికి ఈ చర్యను భగ్నం చేసినా ఊహించని పరిణామానికి పోలీసులు గాభరా పడ్డారు.
  • నేడు ప్రెస్ క్లబ్ లో గద్దర్, అల్లం నారాయణ, పాశం యాదగిరి లతో సహా అనేక మంది కళాకారులు, ప్రజా సంఘాలు కేసీఆర్ ను దీక్ష విరమించుకోవాలని, రేపు జరుగు శాంతి యాత్రను విజయవంతం చేయాలని కోరాయి.

మరోపక్క కేసీఆర్ ఆరోగ్యం మాత్రం వేగంగా క్షీనిస్తుంది. డాక్టర్లకు, చికిత్స కు సహకరించటం లేదని తెలుస్తుంది. అసెంబ్లీ లో తీర్మానం పెట్టె వరకు బెట్టు వీడేడి లేదని కేసీఆర్ పట్టు పట్టారు.

Tuesday, December 8, 2009

రేపు ఎం జరగబోతుంది ?

నిజాంను ఎదుర్కోవడానికి సేనలు వస్తున్నాయా?

1948 లో భారత ప్రభుత్వం తో కలవను అన్న నిజాం పై ప్రయోగించిన సైనిక చర్య గుర్తుకు వస్తుంది నేటి పోలీసుల బలగాలను చూస్తుంటే. నేడు తెలంగాణ ప్రతి పల్లె గుండె పై పోలీసుల పద ఘట్టనలు కవాతు చేస్తున్నాయి. 23 వేల సాధారణ పోలీసులకు బలగాలకు తోడు, 1650 సెంట్రల్ రిసర్వ్ పోలీసులు (సీఆర్పిఎఫ్), 1470 రాపిడ్ ఆక్షన్ ఫోర్స్ పోలీసులు, 630 మంది బార్డర్ సెక్యూరిటీ దళాలు (బిఎస్ఎఫ్), జిల్లా స్థాయిలో ఒక్కో చోట 2000 నుంచి 2500 మంది పోలీసులు, నగరంలో 85కు పైగా చెక్ పోస్టులు వీటన్నింటినీ ఆజమాయిషీ చేయడానికి 60 మంది ఐపీఎస్ ర్యాంక్ అధికారులను నియమించారు. తెలంగాణా అంతటా 144 వ సెక్షన్ విధించారు.

జిల్లాల వ్యాప్తం గా విద్యార్థులను వారి నాయకులను అరెస్ట్ చేయడం, కళాకారులను నిర్భందించటం చూస్తుంటే మనం ప్రజాస్వామ్యం లో ఉన్నామా లేదా నియంతల పరిపాలనలో ఉన్నామా అనిపిస్తుంది. విదేశాలలో ఉన్న తెలంగాణ మద్దతు దారులు తమ నిరసన తెలపటానికి ఉరేగింపులకు అనుమతులు సునాయాసంగా పొందుతూ ఉంటే స్వదేశం లో ఇంతటి దౌర్బాగ్య పరిస్థితులలో ఉన్నామా అని అనిపిస్తుంది.

అదీ కాకుండా ఒక పక్క ఉద్యమ నాయకుడు చావు బతుకుల మధ్యన కొట్టు మిట్టాడుతుంటే, అమ్మగారు సోనియా గాంధీ మన రాష్ట్రం నుంచి వెళ్లే వెన్నెముక లేని నాయకులను పట్టించుకోకుండా జార్కండ్ ప్రచారానికి, పుట్టిన రోజులు జరుపుకోవడం లో ఉత్సాహం చూపిస్తున్నారు. నేడు ఆమె చూపుతున్నఉత్సాహం లో పదవ వంతు మూడున్నర కోట్ల ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష అయిన తెలంగాణపై చూపితే బాగుంటుంది. మరి సోనియా గాంధీ నేడు తన పుట్టిన రోజు కేక్ కట్ చేస్తారో లేదా ఈ ప్రాంత ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా మూడున్నర కోట్ల గుండెలను కోస్తారో మరి కొన్నిగంటల్లో తేలుతుంది.

-తెలంగాణ భూమి పుత్ర

శోభా రాణి కి ఉన్న ఇంగిత జ్ఞానం మానవాళ్ళకు లేదా?

Monday, December 7, 2009

రాజధాని మం(కం)త్రులు

హైదరాబాద్ కు చెందిన ఇద్దరు మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ లు నిన్న కాంగ్రెస్ లెజిస్లెచర్ మీటింగ్ లో ఒక తెలివి తక్కువ వాదాన్ని లేవనెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఈ ఇరువురూ నాయకులు(?) కోరారు. దీన్ని తెలివి తక్కువ వాదం అనేకన్నా కుట్ర పూరిత ఉద్దేశం అని అనవచ్చు. అయితే దీని వెనక ఎవరున్నారో, ఎలాంటి కుట్ర దాగున్నదో అందరికి తెలిసిందే. హైదరాబాద్ చుట్టూ పక్కల జిల్లాలైన రంగా రెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ లలోని ప్రాంతాలని కలుపుకుని గ్రేటర్ హైదరాబాద్ ఎందుకు ఏర్పాటు చేసారో అందరికి తెలిసిందే.

వాళ్ళు సంపాదించిన ఆస్తులను తెలంగాణా వచ్చినా కాపాడుకునే ప్రక్రియ లో భాగమే గ్రేటర్ హైదరాబాద్, రింగ్ రోడ్ లు. ఈ ఇరువురూ నాయకులు సంపాదించుకున్న(?) ఆస్తులను కాపాడుకోవటం కన్నా తమ వెనక ఉన్న తమ రింగ్ మాస్టర్ల ప్రయోజనాలను కాపాడటమే అధికం. 400 ఏళ్ల క్రిందటే స్వయం ప్రతిపత్తి కలిగిన హైదరాబాద్ రాష్ట్రాన్ని తెలంగాణ నుంచి వేరు చేయాలనే కుహాన వాదమే ఇది. ఇప్పుడున్న పరిస్థితులలో అనివార్యమైన తెలంగాణ ను సాధ్యమైనంత అడ్డుకోవడమే లేదా ఏర్పాటు ను ఆలస్యం చేయడమే ఈ వ్యాఖ్య ల వెనక ఉన్న అసలు కుట్ర.

ఉస్మానియా పై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వం

పోలిసుల కాళ్ళు పట్టుకుని బతిమిలాడుతున్న విద్యార్థులు:


ఓయు లో అమ్మాయిల పై లాఠి:


ఉస్మానియా క్యాంపస్ , మాణికేశ్వర్ నగర్ లో పోలిసుల అరాచకం:


ఆత్మహత్యలు వద్దు, బ్రతికి పోరాడుదాం తెలంగాణని సాదిద్దాం!

Students and Telanganites:
Not to commit suicide, Lets see the dream of Telangana turning into a reality.
ఆత్మహత్యలు వద్దు, బ్రతికి పోరాడుదాం తెలంగాణని సాదిద్దాం!
Appeal to KCR to break the fast, Telangana people are not in a position to lose a able leader.

As we all know its the crucial time and we are hearing demands like "Hyd as UT", "Khammam to be part of Andhra", we will hear more of these demands from our oppenents once there is a favorable environment for Telangana state. KCR is the only one we can count on answering such demands.

Please sign: http://www.petition online.com/ TSTATE/petition. html

బే ఏరియా తెలంగాణ వాదుల సంఘీభావం

Sunday, December 6, 2009

ఎట్టకేలకు... - కృష్ణ చైతన్య అల్లం

ఎట్టకేలకు..
-క్రిష్ణ చైతన్య అల్లం



తెలంగాణం,
అణువణువునా గానమై, నాదమై..
దాగున్న ఆవేశమంతా ప్రణవమై ప్రజ్వలిస్తున్నది..
తెలంగాణ పూలై పూసే ఇక్కడి మొక్కలకి ఓ కొత్త సూర్యోదయం కనిపిస్తుంది.
పక్షుల కిలకిలారావాళ్ళో వినిపించే తెలంగాణ పోరాట గీతాలు కొత్త ప్రాణం పోసుకున్నాయి..

మూడు కోట్ల గొంతుకల్లో నిద్రాణమైన ఆర్ద్రతంతా ఆక్రుతి దాల్చి,
తెలంగాణ గళానికి ఊపిరి పోస్తున్నది..

సలాం కొట్టి అలసిపోయిన చేతులన్నీ కలసిపోయి,
ఉక్కు పాదాలై ఉద్యమాన్ని ఉరకలేయిస్తున్నవి.. ..


మముగన్న మా కన్న తల్లులు పడిన నవ మాసాల క్షోభకి మా జీవితమంతా ఆమెకి ఋణ పడితిమి..
నీ తెలంగాణ బిడ్డల కోసం, నువ్వు పడ్డ నీ
నలభై యేళ్ళ నరకయాతనకి
యేమిచ్చిన తీరునమ్మా,
తల్లీ నా తెలంగాణా, నీ ఋణం?

ని బిడ్డలు పాలేర్లుగ వూడిగం చేస్తుంటె..
రక్తం తాగు రాక్షసులకి కూడా ప్రేమతొ పాలిస్తివే..

ఇంకెన్నాళ్ళింకెన్నేళ్ళీ కన్నీళ్ళు..
ఏడ్చి ఏడ్చి నా తెలంగాణ భూముల నీళ్ళు అడుగంటినవి...
అణగారిన భాధాతప్త హ్రుదయాలు భారమెక్కినవి...

చేతులు కట్టుకునే కాలం కాదిది..
ఇది రెండు వేల తొమ్మిది..

అదుగో చూడు ఎదిగిన నీ బిడ్డల పోరు బాట..
బానిస సంకెళ్ళు తెంచుకుని,
పదం, పాదం, గళం, గానం కలిపి..
ముందుకి, మునుముందుకి ఉరుకుతున్నారు..
భుక్తి కోసం-
విముక్తి కోసం-
మన భాష కోసం,
మన యాస కోసం..
ఉగ్రరూపులై కలసి కట్టుగ కదులుతున్నారు ...

అదిగో చూడు నా తెలంగాణ వైద్యుల,
ఆరని నీ గాయాల మాన్పగ ఒక్కటైన ఆ చెలిమి చూడు..

అదిగో చూడు నా తెలంగాణ న్యాయవాదుల..
తరతరాల అన్యాయానికి న్యాయం కూర్చగ బయలు దేరిన్లు..

అదిగో చూడు కన్నెర్ర జేసిన నా తెలంగాణ విద్యార్ధి ఉక్కుపిడికిలి ప్రభంజనాన్ని...
వెలుగు బాటల వేకువ కాంతి పుంజాన్ని పోరాట సమిధగ మార్చి భుజాన ఎత్తుకున్నడు...
తన ఉగ్ర కంఠపు జై తెలంగాణ నినదంతో హోరెత్తిన ఆకాశం చూడు,
కమ్ముకున్న కారుమబ్బులాంధకారం ఎట్ల తొలగిపోతుందో..

అదిగో చూడు నా నాయి బ్రాహ్మల నాయకత్వం...
ఇదిగో చూడు నా రజకుల ఉడుకు రక్తం..

అదిగో చూడు నా తెలంగాణ ఆడ పడచుని...
అన్నం పెట్టి ఆదరించే ఆ మనసులో ఇప్పుడున్నది ప్రశాంతత కాదు...
అది ఆరని మంటల ప్రజ్వలన.

ఇదిగో చూడు నా తెలంగాణ పల్లె జనాలని ..
ఆ బురద కాళ్ళల్ల కొత్త బలం చూడు..
జానపదం, జనపదం ఏకమై దేదీప్యమానంగా వెలిగే ఆ కళ్ళళ్ళో ఆశా జ్యోతిని చూడు..
బీడు పడ్డ భూములు నిలపెట్టి నిలదీస్తుంటే, సమాధానం చెప్పలేని నా రైతు..
పురుగులమందు కి తలొంచలేక, తలెత్తి బయలుదేరిండు సమాధానం వెతుక్కుందామని.

దగాపడిన నా తెలంగాణ కరువు తీరెదెప్పుడని నిగ్గదీసి అడుగుతున్న
నా తెలంగాణ మేధోసంపత్తినీ, విద్యావేత్తలని చూడు..

కొలిమంటుకున్న నా ఉస్మానియాని చూడు..
ఇక్కడి గోడల్ల ప్రతీ బండ తెలంగాణ పోరాటాన్ని శ్వాసిస్తుంది..

జోరుగున్న నా ఓరుగల్లు పోరుని చూడు...

పాట్లు పడుకుంట పాఠాలు చెప్పినం, గుణపాఠాలు చెప్పే సమయం వచిందంటున్న,
బతకలేని, నా తెలంగాణ బడి పంతుళ్ళని చూడు..

ఉద్యమం కోసం బలైపోయిన అమరుడు నా తెలంగాణ కానిష్టేబులుని చూడు..

ముక్కుపచ్చలారని బాల్యాన్ని పణంగ పెట్టి ఉద్యమానికి ఊపునిచ్చిన,
అమరవీరుడు చిరంజీవి “శ్రీకాంతు“ సావుల భీతి లేని ఆ ధైర్యం చూడు..

గోడునీ, గొడవనీ అహర్నిశలూ అందరికందిస్తూ మమేకమైన నా తెలంగాణ జర్నలిష్టు మిత్రుల శ్రమైకతని చూడు..
లొల్లి మొదలూ, తుదీ, ఆద్యంతం నిజాల నిగ్గు తేల్చ ప్రయత్నించే నా తెలంగాణ మీడియా చూడు..
సాయెతనిచ్చే నా ప్రవాస తెలంగాణ చూడు..

అందరొక్కటయిన ఆ కన్నుల పండుగ చూడు..
ఉడుకుతున్న ఆ రక్తం చూడు..
అంటుకున్న అగ్గిసెగల వేడి ని చూడు..
వాడిగున్న మాటలని , వేడిగున్న పాటలని చూడు..
కోటిరతనాల కొల్లగొట్ట బడ్డ వీణని పునర్నిర్మించే మనోబలం చూడు..

ఉద్యమం అంటె ఉద్యమం కాదు,
మరది, మాకన్న తల్లి ఊపిరి!

ఆయుధమంటె ఆయుధం కాదది,
అవధుల్లేని ఆత్మ స్థైర్యం..

పోరాటమంటె పోరాటం కాదది,
నిలువెత్తున ఎగసిపడే ఉత్తేజ కెరటం.

నేలంటే నేల కాదు మరది,
మూడు వందల అమరవీరుల ఆత్మ త్యాగాలకి సాక్ష్యమయిన పవిత్ర ఉస్మానియా ప్రాంగణం..

మట్టి వాసన కాదు మరది,
చెర వీడుతున్న స్వాతంత్ర్యపు సుగంధ పరిమళం..

పైనుంచి కొమురం భీం చెప్తున్నడు సాకలి ఐలవ్వకు..
"రాదంటివి కద, కింద భూమిని సూశి మాట్లాడు మరి" అని
దొడ్డి కొమురయ్య, బందగి కూడ తలూపిన్లు
"ఔ మరి" అన్నట్టు..
గట్టిగ శ్వాస తీస్కొని మనసుల అనుకున్నరు..
"ఎట్టకేలకు..!! "
(1969 నుండి తెలంగాణ కోసం అమరుడైన ప్రతీ సైనికుని ఆత్మ త్యాగం మమ్ముల నడిపిస్తుంది..)

చికాగో లో ఎగిసిన తెలంగాణ వేడి

ఆస్ట్రేలియా నుంచి సలాం తెలంగాణ

ప్రభుత్వ తీర్మాన నాటకం - మళ్లీ అదే కుట్ర

గత యాభై ఏళ్లుగా తెలంగాణా కు మోసాలు చేసి చేసి అలవాటైన పాలకులు ఇంకొక కొత్త కుట్రకు తెర లేపారు. నేడు ముఖ్యమంత్రి రోశయ్య తెలంగాణ పై ఉద్యమించే వారికి రెండు తాయిలాలు ప్రకటించింది. వాటిలో ఒకటి రాష్ట్ర పరిధి లో లేని ఫ్రీజోన్ పై అసెంబ్లీ లో తీర్మానం చేస్తామని, రెండోది కేసీఆర్ పై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని రెండు అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది.

సుప్రీం కోర్టు లో ఉద్దేశ పూర్వకంగా కేసు ని ఓడిపోయిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటివరకు ఇది తమ పరిధి లో లేదు అని చెప్తూ వస్తున్న పాలకులు నేడు కంటి తుడుపు చర్య గా కుట్ర పూరిత ప్రకటన చేసింది. అయితే హటత్తుగా తెలంగాణా ఉద్యోగుల పై ప్రభుత్వానికి ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చింది అనుకుంటున్నారా? దీనిలో దాగున్న కుట్ర ఏంటంటే రేపటి నుంచి ఉద్యోగులు చేయదల్చిన నిరవధిక పెన్ డౌన్ ను ఆపటo తో పాటు ఉద్యోగులను ఉద్యమం నుంచి వేరు చేయడమే.

గత నెలలో సిద్దిపేట లో ఉద్యోగులు సమావేశం నిర్వహించి ఎంతగా మొత్తుకున్నా పెడచెవిన పెట్టిన ప్రభుత్వం నేడు వారిని ఎమార్చాలని ప్రయత్నిస్తుంది. అయితే ఉద్యోగులను ఈ ప్రభుత్వ ఉచ్చు లో పడవద్దని, ఇప్పుడు ఫ్రీజోన్ అంశమే కాకుండా తెలంగాణ కూడా నిర్ణయాత్మక దశకు చేరుకున్నందున బెట్టు వీడవద్దని మేధావులు కోరుకుంటున్నారు.



ఇక రెండో బహుమతి గురించి చెప్పుకుందాం. కేసీఆర్ పై పెట్టిన కేసులు ఎత్తివేయడం. పెట్టిన కేసులే కుట్ర పూరితమైనవి అయినప్పుడు మళ్ళీ వాటిని ఎత్తివేయడం అంటే అంతకన్నా మోసం ఇంకోటి లేదు. ఒక పార్లమెంట్ సభ్యుడు, ముప్పై ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న నాయకుడు, ఒక్కటంటె ఒక్క క్రిమినల్ కేస్ లేని ప్రజా ప్రతినిధి అని చూడకుండా గ్రేహౌండ్స్ దళాలను దింపి ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష అయిన తెలంగాణ ఏర్పాటు కోసం రాజ్యాంగం కల్పించిన హక్కు అయిన శాంతియుత పద్దతి లో నిర్వహించ తలబెట్టిన నిరాహార దీక్షను భగ్నం చేయడమే కాకుండా అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా ఖమ్మం జైల్ లో పెట్టి రాజద్రోహ కేసు ను పెట్టింది ఈ దుష్ట ప్రభుత్వం.

చనిపోయిన రాజశేఖర్ రెడ్డి పై ఎప్పుడో చేసిన మత కలహాల అభియోగాన్ని మోపి (ముందు పత్రికలకు చెప్పిన కారణం ఇదే) కేసు బనాయించటం అంటే అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. ఇదే విషయమై గతంలో ఎంతో మంది వైఎస్ ను అన్నారు. వీటన్నింటినీ విస్మరించి ఈ కేసు ను పెట్టటమంటే దాని వెనక ఉన్న శక్తులు ఎవరో మనం సులభం గా ఊహించగలం.

అయితే వీటి వెనక ఉన్న మరొక నిగూఢ కుట్ర ఏంటంటే, కార్యకర్తల పై పెట్టిన కేసుల గురించి మాట్లాడకుండా నాయకుడి కేసుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు అంటే కార్యకర్తలకు, నాయకుడికి మధ్య అంతరాన్ని సృష్టించడమే. ఇన్ని కుట్ర లకు మధ్య మనల్ని మనం కాపాడుకుంటూ, మన నాయకుడిని కాపాడుకోవాల్సిన భాద్యత ఉంది. తద్వారా ఉద్యమాన్ని కాపాడుకుంటూ తెలంగాణ సాధించుకోవాలని కోరుకుంటూ...

- తెలంగాణ భూమీపుత్ర

విద్యార్థులు నాయకత్వం లోకి ఉద్యమం ?!

Saturday, December 5, 2009

అమీర్ పెట్ - పంజగుట్ట లో ద్వంస రచన ఒక కుట్ర

ఊయల బ్లాగ్: ప్రత్యేక తెలంగాణ - ఒక సమైక్యవాది ''ఆత్మవిమర్శ''



నిన్న మొన్నటి వరకూ ''ప్రత్యేక తెలంగాణ'' అనేది కొంతమంది ''రాజకీయ నిరుద్యోగులు'' చేస్తున్న ఆర్భాటంగా 'లైట్‌' తీసుకున్నాను. గుప్పెడు మంది స్వార్థపరులు ఆడుతున్న నాటకంగా పెదవి విరిచాను. దుర్మార్గమైన ''వేర్పాటు వాదం'' గా ఈసడించుకున్నాను.

రాష్ట్ర విభజనను దేశ విభజనతో పోల్చుకుంటూ ప్రత్యేక తెలంగాణా ఇస్తే దేశం ముక్క చెక్కలైపోతుందని ఆవేశపడ్డాను. భారత పాకిస్థాన్‌ల మాదిరి వైషమ్యాలు తలెత్తి తెలుగు ప్రజల ''సమైక్యత'' సర్వనాశనమై పోతుందని ఆవేదన చెందాను.

కె.సి.ఆర్‌. అనే వ్యక్తికి (2000 సంవత్సరంలో) చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వక పోవడం వల్లనే ఈ గొడవ తలెత్తిందనీ, ఆయనకు గనక అప్పుడు ఓ మంత్రి పదవి పడేస్తే మిగతా తెలంగాణా నాయకమ్మణ్యుల్లా ఈయనా కిక్కురుమనకుండా పడివుండేవాడు కదా అని నమ్మాను.

అతను ఈ తెలంగాణా వాదాన్ని తీసుకురాకపోతే-

ఆంధ్రావాళ్లు, రాయల సీమవాళ్లు, అట్లాగే హైదరాబాద్‌లోనూ, ఇతర తెలంగాణా జిల్లాల్లోనూ లక్షలాదిగా స్థిరపడిన ''సెటిలర్లు'' అందరూ ... ఎవరిపనులు వాళ్లు చేసుకుంటూ హాయిగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, సుభిక్షంగా, ప్రశాంతంగా, సుఖ సంతోషాలతో వుండేవారు కదా ...అని అనేకానేకసార్లు మదనపడ్డాను.

పిల్ల నిచ్చిన మామ నుంచి ''అదనపు కట్నం'' గా ముఖ్యమంత్రి పదవినే లాక్కున్న బాబు, ఈ అర్భకుడి మొహాన ఓ మంత్రి పదవి కొడితే ఏం పోయేదని చాలా సార్లు తెగ బాధపడిపోయాను. కె.సి.ఆర్‌. మీద కంటే అతనికి మంత్రిపదవి నిరాకరించి తప్పు చేసిన బాబు మీదే నాకు ఎక్కువ మంటగా వుండేది.

ఒక మంత్రి పదవి పడేస్తే కే సి ఆర్ తెలంగాణ జపం చేసేవాడే కాదని అందరిలా నేను కూడా భావించినప్పటికీ, ఆయనకు ఏకంగా కేద్ర మంత్రి పదవి వచ్చినా తెలంగాణ వాదాన్ని ఇంకా ఎందుకు అంటి పెట్టుకుని వుండి పోయాడో అర్ధం అయ్యేది కాదు. అంత స్వార్ధ పరుడు, రాజ కీయ నిరుద్యోగి అన్న ముద్ర పడ్డ వ్యక్తీ ఎంతో ప్రతిష్టాత్మకమైన కేంద్ర మంత్రి పదవి లభించినా దానిని గడ్డి పోచలా ఎట్లా విసిరి కొట్ట గలిగాడో, అన్ని సార్లు ఎం పీ సీటుకు రాజీనామా చేసి వేరు వేరు నియోజక వర్గాల్లో ఎట్లా విజయం సాధించ గలిగాడో ఆయనకు ఆ ధైర్యం ఎక్కడినుంచి వచ్చేదో అని నేను ఎప్పుడూ ఆలోచించిన పాపాన పోలేదు. కే సి ఆర్ రాజకీయ నిరుద్యోగి అన్న పాత పాటనే అరిగిపోయిన రికార్డులా పాడుకుంటూ, నిందిస్తూ, అసహ్యంగా వితండ వాదం చేస్తూ కూచుంది పోయాను.

సరే మేం పుట్టిందే తెలంగాణ సాధన కోసం అనే తె. రా. స. తెలంగాణ జపం చేయడంలో పెద్దగా ఆశ్యర్య పోవాల్సిందేమీ లేదు. కానీ రాష్ట్రం విడిపోకూడదని కోరుకునే (!) కాంగ్రెస్‌ పార్టీ 2004 ఎన్నికలలో తెరాసతో పొత్తు పెట్టుకోవడం, అధికారంలోకి రావడం తెరాస వాళ్లకి రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ మంత్రిపదవులివ్వడం, తెలంగాణ అంశాన్ని కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాంలో పెట్టి ప్రధాన మంత్రి చేత, రాష్ట్రపతిచేత పార్లమెంట్‌లో చెప్పించడం, ప్రణబ్‌ముఖర్జీ కమిటీ వేసి నాటకమాడటం మాత్రం నాకు ఒక పట్టాన జీర్ణమయ్యేది కాదు.

అట్లాగే సమైక్యవాదం జపిస్తూ, తన హయాంలో ''తెలంగాణ'' అన్న పదాన్ని కూడా ఉచ్ఛరించనివ్వని నికార్సయిన సమైక్య తెలుగుదేశం పార్టీ - తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయడం, తెరాసతో పొత్తు పెట్టుకుని 2009 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం నన్ను మరింత గందరగోళానికి గురిచేసింది.

సీపీఐ, బిజేపీ, ప్రజారాజ్యం పార్టీలు కూడా తెలంగాణకు అనుకూలంగా తీర్మానాలు చేయడంతో బెంబేలెత్తి పోయాను. ఈ పార్టీలన్నీ ఉత్తిత్తిగానే, ఒల్లెక్కలకు తెలంగాణ పాట పాడాయి కానీ లోపల వాటి ధ్యేయం సమైక్యతే అని ఆత్మవంచన చేసుకోవడం నా వల్ల కాలేదు.

తెలంగాణకు ప్రజల్లో మద్దతు లేకపోతే ఇన్ని ప్రధాన పార్టీలు తెలంగాణాకు అనుకూలంగా ఎట్లా తీర్మానం చేస్తాయి. ఒకవేళ ఓట్ల కోసం అట్లా ''బడాయి'' తీర్మానాలు చేసినా అవి సమైక్యతనే కోరుకుంటున్నాయని అనుకున్నా అది తెలంగాణ ప్రజల్ని మోసం చేయడమే కదా?
ఇట్లా చూసినా మెజారిటీ తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రం తమకు కావాలని కోరుకుంటున్నట్టు రూఢి అవుతోంది కదా?

అయినా నేను ఇన్నాళ్లూ ఈ విషయాలపై పెద్దగా దృష్టి కేంద్రీకరించకుండా అందరిలాగే మెజారిటీ ప్రజల ఆకాంక్షను పక్కనపెట్టి, అసలు సమస్యను గాలికి వదిలేసి తెరాస పార్టీ కుప్పిగంతులమీద, అది వేసే డ్రామాల మీద, ''బక్కోడు'' (ఈ మాట నాది కాదు, నికార్సైన సమైక్యవాదులది) ఉపయోగించే భాష మీద, తెరాసకు వచ్చే ఓట్ల మీద, సీట్ల మీద,తెలుగు తల్లి మీద, తెలంగాణ తల్లి మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరించి వాదోపవాదాలు చేస్తూ వచ్చాను.

తెరాస టికెట్‌తో గెలిచిన 26 మంది ఎంఎల్‌ఎలలో 10 మందిని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ బుట్టలో వేసుకున్నప్పుడు, తెరాసలో నెంబర్‌ టూ టైగర్‌ నరేంద్రను కూడా చాకచక్యంగా లోబరచుకున్నప్పుడు, విజయశాంతి మీదకు కూడా గేలం విసిరినప్పుడు, తెలంగాణ వాళ్ల మీదకు తెలంగాణ వాళ్లనే ఉసి కొల్పుతున్నప్పుడు లోలోపల అట్లాంటి పనులు చేయడం ధర్మం కాదని అంతరాత్మ ఘోషిస్తున్నా .... ఏదో ఒక విధంగా సమైక్యత నిలబడుతోంది కదా అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. నేను అందరిలా శాడిస్టిక్‌గా ఆనందించానే తప్ప అది లత్తకోరు, ఫాక్షనిస్టు రాజకీయం అవుతుందే తప్ప ప్రజాస్వామ్యం కాదని గట్టిగా ఎవరితోనూ అనలేకపోయాను.. దానివల్ల మన సమాజంలో, రాజకీయాలలో విలువలు మరింత పతన మవుతాయన్న భావన నాకు అప్పుడు ఏ కోశానా రాలేదు. వచ్చినా ''తెలంగాణను వ్యతిరేకించే మైకం''లో దానిని ఏమాత్రం పట్టించుకోలేదు.

మొన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలలో తెరాస పోటీ చేయాడానికి కూడా భయపడి తోక ముడిచి మొహం చాటేసినప్పుడు ఇక తెలంగాణ వాదం పని అయిపోయినట్టే ... ప్రజల్లో తెరాసకి పలుకుబడి పూర్తిగా తగ్గి పోయినట్టే అని సంబరపడ్డాను. ఒకవేళ తెరాస పోటీ చేసి ఓ పదో పాతికో కార్పొరేటర్‌ సీట్లు గెలిచినా మన ఘనత వహించిన నూరేళ్ల చరిత్ర వున్న జాతీయ కాంగ్రెస్‌ పార్టీ ఆ తెరాస కార్పొరేటర్లని అవలీలగా కొనిపారేసిది. గొడవ వొదిలిపోయేది. అయితే అది వేరే విషయం.

కెసిఆర్‌ ''ఆమరణ'' దీక్ష చేస్తానని ప్రకటించినప్పుడు ''ఉత్తర కుమారుని'' ప్రగల్భంగా ఎంత నవ్వుకున్నానో. 24 గంటల్లో దీక్ష తుస్సవుతుంది, తెలంగాణ ఫట్టవుతుంది అని చంకలు గుద్దుకున్నాను. ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కెసీఆర్‌ను అనవసరంగా అరెస్టు చేసి ఖమ్మం జైల్లో పెట్టడం, ఆయనేమో జైల్లోనే దీక్ష కొనసాగించడం నన్ను మళ్లీ కొంత ఆందోళనకు గురి చేసింది. అయితే రెండో రోజు బలవంతంగా సెలైన్‌ ఎక్కించగానే కెసీఆర్‌ దీక్ష విరమించినట్టు ప్రకటించగానే ఫినిష్‌ ప్రత్యేక తెలంగాణ వాదానికి శాశ్వతంగా నూకలు చెల్లినట్టే అని ఎగిరి గంతులేశాను.

కానీ ఆ మరుక్షణమే తెలంగాణలోని విద్యార్థులు తిరగబడి కేసీఆర్‌ని తెలంగాణ ద్రోహిగా ప్రకటించి ఇక నుంచి తెలంగాణ ఉద్యమాన్ని తామే నడుపుతామని చాటడంతో షాక్‌కు గురయ్యాను. విద్యార్థుల వార్నింగ్‌కి జడిసిన కెసిఆర్‌ నేను దీక్ష విరమించలేదు, అదంతా పోలీసుల కుట్ర అనడం, దీక్ష కొనసాగించడం దరిమిలా పరిస్థితి అంతా ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా మారిపోవడం నన్ను మళ్లీ తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది.


తెలంగాణ లోని అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, రైతులు, కార్మికులు రోడ్ల మీదకు వచ్చి జై తెలంగాణ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తుంటే
ఇంకా నేను కెసిఆర్‌ భాష గురించి,
టిఆర్‌ఎస్‌కు వచ్చిన అసెంబ్లీ సీట్ల గురించి
చర్చించుకుంటూ
తెలంగాణలో మెజారిటీ ప్రజలు తెలంగాణను కోరుకోవడం లేదని బుకాయిస్తూ ఆత్మవంచన చేసుకోలేకపోతున్నాను.
అందుకే ఈ ఆత్మవిమర్శ చేసుకుంటున్నాను.

ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కెసిఆర్‌ ఒక్కడి ఉద్యమం కాదు.
నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఉద్యమంగా మారిపోయింది. తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్షలో నిజాయితీ వుంది, నిబద్ధత వుంది, న్యాయం వుంది.

1956లో తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేసేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు విడిపోవాలనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరిపే నిజాయితీ మన ప్రజాస్వామ్యానికి ఎలాగూ లేదు.

అన్ని పార్టీలూ తాము తెలంగాణాకు అనుకూలమే అంటూ తీర్మానాలు చేసి ప్రజలను వంచించి ఓట్లు దండుకుంటున్నాయి.
ఒక్క పార్టీ కూడా మేం సమైక్యవాదులం.
ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకులం అని ధైర్యంగా ప్రకటించిన పాపానపోలేదు.
అంత ధైర్యం ఏ ప్రధాన పార్టీకీ లేదు.
అట్లాంటప్పుడు తెరాసకి వచ్చినవి మాత్రమే తెలంగాణా కోరుకునే వారి ఓట్లు
మిగతా పార్టీలకు వచ్చినవన్నీ సమైక్యతను కోరుకునే వారి ఓట్లు అని ఎట్లా అంటారు?
దానంత పచ్చి అవకాశ వాదం, దుర్మార్గం మరొకటి వుంటుందా?

ఇవాళ తెలంగాణాలో ప్రత్యేక రాష్ట్రంకోసం ఎంతో మంది ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజిస్తున్నా కూడా స్వార్థపరులైన రాజకీయ నాయకుల్లాగా ఉష్ట్రపక్షుల్లా వ్యవహరించడం నా వల్ల కాదనిపించింది.

1956లో ఇట్లాంటి దుర్మార్గపు రాజకీయ నాయకుల ఎత్తులకు, జిత్తులకు మోసపోయే తెలంగాణా ఆంధ్రాలో విలీనమయింది. అప్పటి పెద్ద మనుషుల ఒప్పందాలను, ముల్కీ నిబంధనలను, ఫజల్‌ అ లీ మిషన్‌, గిర్‌గ్లాని కమిషన్‌ నివేదికలను, 610 జీవో మొదలైనవాటన్నింటినీ తుంగలో తొక్కడం వల్లనే, విలీనమప్పుడు చేసుకున్న ఒప్పందాలకు నిజాయితీగా కట్టుబడి వుండకపోవడం వల్లనే... నిధులూ, నీళ్లు, ఉద్యోగాల్లో తీరని అన్యాయం జరగడం వల్లనే .... తెలంగాణా ప్రజల్లో విడిపోతే తప్ప బాగుపడమన్న భావన బలంగా ఏర్పడింది. ఇప్పుడు ఏ పైపూతలు, లేపనాలు, లేహ్యాలు, ఒప్పందాలు, ఏ అభివృద్ధి లెక్కలూ పత్రాలూ చైతన్యవంతులైన తెలంగాణా ప్రజలను ఏమార్చలేవు. అవన్నీ ఇక వృధా ప్రయాసే!

నిన్నమొన్నటి పొత్తులు, ప్రణబ్‌ కమిటీ, రోశయ్య కమిటీ నాటకాలు, తెలంగాణా అనుకూల తీర్మానాలు, నోటితో మెచ్చుకుంటూ నొసటితో వెక్కిరించే రాజకీయ అవకాశవాదం తెలంగాణా ప్రజలను మరింత రెచ్చగొడుతున్నాయి.

కడపులో లేంది కావలించుకుంటే రాదంటారు.
మేడిపండులాంటి సమైక్యత వల్ల ఎవరికీ ఒరిగేది ఏమీ వుండదు.
మన సమైక్యతని రాజకీయ అవకాశవాదులు, పెట్టుబడిదార్లు, భూస్వాములు, కాంట్రాక్టర్లు ఎప్పుడో మలినం చేశారు. ఇప్పుడది సెప్టిక్‌ అయివుంది. ఇంకా తాత్సారం చేయడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ఎన్నో నిండు ప్రాణాలు బలవుతాయి.
తెలంగాణా ఆంధ్ర విడిపోవడం వల్ల సామాన్యులకు, నిజాయితీపరులకు ఒనగూడే నష్టం ఏమీ వుండదు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చుపెడ్తున్నది ఇరుప్రాంతాల స్వార్థపరులూ, అవకాశవాదులే.

తెలుగువాళ్లు ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల మంది వున్నారు. తెలంగాణా ఆంధ్రాల్లో వున్నవాళ్ల సంఖ్య కేవలం 8 కోట్లే. ఈ దృష్ట్యా రెండు రాష్ట్రాలుగా ఏర్పడినంత మాత్రాన తెలుగు ప్రజల ఐక్యతకు ఏర్పడే ముప్పు ఏమీ వుండదు. హిందీ వాళ్లకు ఆరేడు రాష్ట్రాలు వుండగా లేనిది మనకు రెండో మూడో రాష్ట్రాలు వుంటే తప్పేమిటి? బలవంతపు కాపురం వల్లనే మన సమైక్యత, మన సహృద్భావం దెబ్బతింటాయి. కాబట్టి నేను నా సమైక్యవాదానికి తిలోదకాలిస్తూ, ఆంధ్ర - తెలంగాణా రాష్ట్రాలు సామరస్యంగా, అన్నదమ్ముల్లా విడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

(గల్పిక)

తెలంగాణా చరిత్ర గురించి వివరంగా తెలుసుకోవాలనుకునే వారి కోసం కొన్ని లింకులు:

video.google.com/videoplay?docid=7730660376611492753#
http://www.telangana.org/TelanganaFAQ.asp
http://discover-telangana.org/wp/2002/08/06/gentlemens_agreement_andhra_telangana_1956/
http://discover-telangana.org/wp/2007/06/14/6point_formula_girglani_report_vol2/
http://telangana1969.com/martyrs1.html
http://telanganamedia.wordpress.com/
http://discover-telangana.org/
http://www.telangana.org/Home.asp

JAI TELANGANA ! JAI ANDHRA !! JAI RAYALA SEEMA !!!

Friday, December 4, 2009

తెలంగా(ర)ణం

మహబూబ్ నగర్: కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి ఇల్లు ముట్టడించిన ఏబీవీపీ విద్యార్థులు
మెదక్: జడ్పీ ఛైర్మన్ బాలయ్య కారుపై తెరాస నాయకులు చెప్పులతో దాడి
వరంగల్: కొండ సురేఖ ఇంటి ముట్టడి కి యత్నం
మెదక్: కొండపాక - దుద్డేడా మధ్య ౩౫ బస్సులను ధ్వంసం చేసిన ఉద్యమకారులు
డిఎస్ నివాసాన్ని ముట్టడించిన విద్యార్థులు - తెలంగాణ కు మద్దతు ఇవ్వాలని డిమాండ్
నిమ్స్ వద్ద చిరంజీవి ని ఘెరావ్ చేసిన తెలంగాణ వాదులు
ఇల్లందు టిడిపి కార్యాలయం ఎదుట ధర్నా
కరీంనగర్: నల్ల బాడ్జి లు ధరించి విధులకు హాజరయిన డాక్టర్లు,నర్స్ లు
నల్గొండ: ఆలేరులో సోనియా గాంధీ శవ యాత్ర
సూరత్ లో తెలంగాణ వాదుల ధర్నా వంద మంది అరెస్ట్
కాసోజూ శ్రీకాంత్ మృతికి కొవ్వొత్తుల నివాళి


మళ్లీ గజ్జెకట్టిన రసమయి

తెలంగాణ పై ఎవరేమన్నారు ?

కేసీఆర్ ను ఈ పరిస్థితుల లో చూస్తుంటే దుఖం వస్తుంది - ఈటెల
తెలంగాణ కు మద్దతు తెలపకపోతే పార్టీలకు పుట్ట గతులుండవు - దిలీప్ కుమార్
బిజెపి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంది - దత్తాత్రేయ
హస్తినా పురంలో గుడ్డి వాళ్ళే కాకుండా చెవిటి వాళ్ళు ఉన్నారని, రాష్ట్రంలో పాలకులకు తోలు మందం - పాశం యాదగిరి
సామాజిక తెలంగాణ కు నేను కట్టుబడి ఉన్నాను - చిరంజీవి
అధిష్టానం తో నేను మాట్లాడతా - డీ ఎస్

Thursday, December 3, 2009

మేము సైతం తెలంగాణ సాధన కోసం.....

మేము సైతం తెలంగాణ సాధన కోసం అంటూ ముందుకు వస్తున్నారు నేడు అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు చెందిన సామాన్యులు. ముందు ఒక పార్టీ కార్యక్రమం గా ప్రారంభమైన ఈ పోరాటం నేడు అనూహ్యమైన మలుపు తీసుకుంది. అన్ని వర్గాలకు చెందిన సామాన్య ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. దానికి నిదర్శనమే ఈ క్రింది కొన్ని మచ్చు తునకలు.


  • కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో బట్టలు ఉతక వద్దని నిర్ణయించిన ఇల్లందు రజక సంఘం. దీనిని అంతటా స్పూర్తిగా తీసుకోవాలని తెలంగాణ విద్యావంతుల వేదిక అభ్యర్థన. వీరి బాటలో నడవనున్న నాయి బ్రాహ్మణులు.
  • తెలంగాణ కోరుతూ ఆటో ల బంద్‌కు పిలుపునిచ్చిన వరంగల్ ఆటోవాలాలు. వీరి బాటలో నడవనున్న హైదరాబాద్ ఆటో డ్రైవర్లు.
  • అన్ని తెలంగాణ జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులు.
  • ప్రభుత్వం విద్యార్థులకు ప్రకటించిన సెలవుల్లో తెలంగాణ పాఠాలు చెప్తాం - లెక్చరర్లు.
  • పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని వి. హెచ్. హనుమంతరావు ఇంటి ని ముట్టడించిన ఉస్మానియా విద్యార్థులు.
  • తెలంగాణ అంతటా అయ్యప్ప స్వాముల భారీ ప్రదర్శనలు. పరిగి లో స్వాములను అరెస్ట్ చేసిన పోలీసులు.
  • ప్రత్యేక తెలంగాణ కోరుతూ నిజామాబాద్ లో చిన్నారుల రిలే నిరాహార దీక్షలు.
  • మంచిర్యాల లో న్యాయవాదుల మానవ హారం.
  • 118మంది తెలంగాణ ద్రోహుల దిష్టి బొమ్మలు తగులబెట్టి, పోర్లు దండాలు పెట్టిన ఉస్మానియా విద్యార్థులు.
  • కరీంనగర్ జిల్లా లో అగ్ని గుండం లో నడిచిన గ్రామస్థులు.

అయితే ఇవేం పట్టని అధికార కాంగ్రెస్ పార్టీ మేయర్ ఎన్నికలో నిమగ్నమై ఉండగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం కు నేడు ఓబులపురమే ముఖ్యమైన ఘటన. వీరికి గట్టిగా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది.....

జై తెలంగాణ ! జాగో తెలంగాణ !!


తెలంగాణ ఉద్యమానికి లోక్ సత్తా మద్దతు

జోహార్ శ్రీకాంతన్నా !!

జోహార్ శ్రీకాంతన్నా !!
తెలంగాణ నేల పై జన్మించిన ఓ పులిబిడ్డ
ఆఖరి జంగ్ లో అమ్మ కోసం బలి దానం చేసి
నింగి కెగసి ప్రకాశించే తారావయ్యావా !

అగ్నికి అహుతి అవుతూ జంకు బోంకు లేకుండా
తెలంగాణ కోసమని తెగువ చూపి
అమర వీరుడ వయ్యావా !!

నాల్గు కోట్ల గంజి బతుకుల ఆకాంక్ష సాకారానికి
బలి పీట మేక్కి కన్న వాళ్ళని త్యాగ మయులను చేశావా !!

కాలిన శరీరంతో మైకుల ముందు
జై తెలంగాణ అని చెప్పిన ధీరుడవయ్యావా!!

తెలంగాణ అమరవీరుల చరిత్ర పుటల్లోకెక్కి
మాకు కన్నీళ్లే మిగిల్చి వెళ్ళావా!!

తెలంగాణ లడాయికి ఊపిరిలుదె
"ఉస్మానియా" సిపాయిలకు
శక్తినిచ్చే యుక్తిడివయ్యావా!
తెలంగాణ తల్లి విముక్తికి బలి ధానుడవయ్యావా!!

నీ త్యాగం మేం మరవం జన్మాంతం
నీవు లేని ఈ ప్రపంచం మాకు ఏకాంతం
నీ రూపం భావి తెలంగాణకు ప్రతి రూపం!
అన్నా..!నిన్ను కన్న అవ్వ,అయ్యాకు
ఆర్పిస్తున్నాం శిరస్సు వంచి పాదాభివందనం!!!

స్వర్గంలో వీరునివై!నింగిలో మెరిసే తారవై!!
మా పోరులో శక్తీవై!మా అడుగుల్లో అడుగువై!
నీ జ్ఞాపకమె మాకు ఉపిరివయ్యావా!!

గమ్యం చేరే వరకు ఆపం మన పోరు
ఉప్పెనలా లేస్తున్న తెలంగాణలోని ఊరు ఊరు
అందుకో మేము అర్పిస్తున్న శొకతప్త ఆశ్రు నివాళి..!!

అమర హై శ్రీకాంతన్నా!
జై తెలంగాణ!!
జై జై తెలంగాణ!!!

-ముస్కు రాము

కేసీఆర్ ను విడుదల చేయాలని వాషింగ్టన్ లో ప్రవాసుల ఆందోళన

Wednesday, December 2, 2009

కేసీఆర్ పై సిని రచయిత పోసాని అభిప్రాయం

అమర వీరుల త్యాగం వృధా కానివ్వొద్దు


1969లో 370 మంది వీరుల త్యాగాన్ని తెలంగాణ ఎప్పుడో మరిచిపోయింది. (ఒకవేళ మరవకుండా ఉంటే ఈపాటికి తెలంగాణ వచ్చి ఉండేదే). కానీ ఈసారైన ఉద్యమంలో చనిపోయిన వీరుల త్యాగం వృధా కానివ్వొద్దు. మొదటగా చనిపోయిన తెరాస సానుభూతి పరుడు నల్గొండ జిల్లాకు చెందిన శ్రీకాంత్, నిజామాబాద్ జిల్లా కు చెందిన పోలీసు కానిస్టేబుల్ కిష్టయ్య, మరొక పదవ తరగతి విద్యార్థి మృతి ని వృధా కానివ్వొద్దు.

అయితే ప్రభుత్వ నిర్భందం ఎప్పుడూ ఉన్నట్టే ఇప్పుడూ ఉంటుంది. ఉద్యమాన్ని మలినం చేసే కుట్రలు ఇప్పుడూ జరుగుతాయి. వీటన్నింటినీ మరియుగత అనుభవాలను దృష్టి లో పెట్టుకుని సమైక్య నాయకత్వంలో ముందుకు కదిలి తెలంగాణ సాధించుకోవాలి.

జై తెలంగాణ - జాగో తెలంగాణ

నాలుగు ప్లాటూన్ల తో నిమ్స్ వద్ద భద్రత



డీఎస్పీ రవి వర్మ ఆధ్వర్యంలో నాలుగు ప్లాటూన్ల తో నిమ్స్ వద్ద భద్రత ను నిర్వహిస్తున్నారు. నిమ్స్ కు ఉన్న మూడు గేట్ల తో సహా అన్ని ప్రాంతాలను సాయుధ పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. ఆసుపత్రి లో ఒక కరడుగట్టిన ఖైదీ లాగానో లేదా ముంబై మీద దాడి చేసిన ముష్కరుల కు భద్రత కల్పించినట్టు అతి చేస్తున్నారు. పోలీసులు చెప్తున్నట్టు 250 సాయుధ పోలీసులే కాకుండా మఫ్టి లో లెక్కలు మిక్కిలి ఉన్నారు.

అలాగే కేసీఆర్ ను కలవటానికి వచ్చే అందరి పై పోలీసులు డేగ కన్ను వేశారు. ఉస్మానియా విద్యార్థులు కానీ లేదా మరే ఇతర వ్యక్తులను కూడా కోర్టు అనుమతి లేకుండా కలవనీయమని పోలీసులు చెప్తున్నారు. పాతిక - ముప్పై ఏళ్లుగా ప్రజా ప్రతినిధి గా ఉన్న ఒక బక్క పలచని వ్యక్తి కి ప్రభుత్వం ఇంతగా ఎందుకు భయపడుతుందో తెలియటం లేదు.


కేసీఆర్ నిమ్స్ కి తరలింపు

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అర్ధరాత్రి కేసీఆర్ ను హైదరాబాద్ నిమ్స్ కు 108 అంబులెన్స్ లో తరలలిస్తున్నారు. తెల్లవారితే తెరాస శ్రేణుల తాకిడి ఉంటుందని అర్ధరాత్రి తరలిస్తున్నారు. సూర్యాపేట - నార్కెట్ పల్లి ల ద్వారా హైదరాబాద్ కు తరలిస్తున్నారు. కేసీఆర్ వెంట కొడుకు తారక రామ రావు, అల్లుడు హరీష్ రావులు ఉన్నారు. అయితే తాజా పరిస్థితుల బట్టి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగా దిగజారిందని, రక్తం లో షుగర్ లెవెల్స్ పడిపోయి కీటోన్స్ పెరిగాయి అని తెలుస్తుంది.




ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మూత్ర పిండాలపై ప్రభావం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. మొదట హెలికాప్టర్ లో తరలిస్తారని భావించినా ఇప్పుడు రోడ్డు మార్గం గుండా తరలిస్తున్నారు. కాన్వాయి లో సుమారు పాతిక వాహనాలు ఉన్నాయి. అయితే ఈ తరలింపు ను తెరాస నాయకులే కోరినందున మార్గ మధ్యoలో ఎటువంటి ఆటంకం ఉండక పోవచ్చని భావిస్తున్నారు.

గత మూడు రోజులుగా తెరాస వర్గాలు ఎంతగా డిమాండ్ చేసిన స్పందించని ప్రభుత్వం చివరకు మానవ హక్కుల కమీషన్ ఆజ్ఞలకు తలొగ్గాల్సి వచ్చింది. కేసీఆర్ హైదరాబాద్ కు రావటం తెరాస కు, ఉద్యమానికి నైతిక బలం చేకూరుతుంది.

Sunday, November 29, 2009

గోనే ప్రకాష్ పై దాడి వీడియో

పోలీసులపై తిరగబడ్డ ఉస్మానియా విద్యార్థి లోకం

ఉస్మానియా విద్యార్ధి లింగ స్వామి కి నివాళి

తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం న్యూజెర్సీ వారి నిరసన

ఉస్మానియా హృదయ విదారక దృశ్యం

ప్రభుత్వ విశృంఖలత్వాన్ని ఖండించండి

కేసీఆర్ అరెస్ట్ తరవాత ఉస్మానియా విధ్యార్థుల పై జరిగిన లాటి ఛార్జ్ ను సభ్య సమాజం లో ప్రతి ఒక్కరూ ఖండించ వలసిందే. సాక్షాత్తూ హోం మంత్రి తెలంగాణ ప్రాంతం కు చెందినదే అయినా విద్యార్థులను వారి సొంత ప్రాంతం,నగరం నడిబొడ్డున ఉస్మానియా యూనివర్సిటీ లో చితకబాదటం దయనీయం. ఒక్కో విద్యార్థిని అరడజన్ మంది పోలీసులు చూట్టు చు ముట్టి విద్యార్థుల వీపుల పై లాటిలు విరిచారు. కరడుగట్టిన నేరస్తులను వేటాడటానికి వచ్చినట్టు గ్రేహౌండ్స్ దళాలు విచ్చల విడిగా విశృంఖలత్వాన్ని ప్రదర్శించాయి.

జరిగిన సంఘటనలు చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా నిర్బందిత పాలన లో ఉన్నామా అని అనిపిస్తుంది. కేసీఆర్ అరెస్ట్ ను తదనంతరం జరిగిన లాటి ఛార్జ్ లను జాగో తెలంగాణ బ్లాగ్ ఖండిస్తుంది.

Saturday, November 28, 2009

హరీష్ రావు అరెస్ట్ వీడియోలు



కెసిఆర్ అరెస్ట్

కేసీఆర్ దీక్షకు పలువురి ప్రముఖులు మద్దతు

కేసీఆర్ దీక్షకు రాష్ట్ర ప్రముఖులు పలువురు రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలుపుతున్నారు. వీరిలో మంద కృష్ణ మాదిగ ఏకంగా కేసీఆర్ తో పాటు దీక్షలో కూర్చుంటానని చెప్పారు. ప్రజారాజ్యం మహిళా అధ్యక్షురాలు శోభ రాణి కూడా దీక్షకు సంఘీభావం తెలిపారు, అయితే ఇది తన సొంత అభిప్రాయమని అన్నారు. కళాకారులు అందె శ్రీ, సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి లాంటి వారు కూడా మద్దతు తెలిపారు.

ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు మధు యాష్కీ, వెంకట స్వామి లు ఇదివరకే మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే వీరిని మరో కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు.

ఇదిలా ఉంటే ప్రభుత్వం ఒకపక్క పోలీసులను చివరి వరకు సంయమనం పాటించాలని చెప్తూ, మరో పక్క ఇప్పుడున్న పోలీసులకు తోడు ఒక ప్లాటూన్ సుశిక్షిత గ్రేహౌండ్స్ దళాలను రంగంలోకి దింపారు. సీనియర్ అధికారులైన ఐజీ మీనా, లడ్దా, ఇక్బాల్, జయ లక్ష్మి లాంటి అధికారులులను కేసీఆర్ పై ఉసిగొల్పుతున్నారు.

గన్ డౌన్ కోసం పోలీసులకు తెరాస విన్నపం

కేసీఆర్ నువ్వు సాక్షత్తు చంద్ర శేఖరుడువి

కేసీఆర్....
ప్రజలు ఎన్టీఆర్ ను అన్న అన్నారు...
ఇందిర ను అమ్మ అన్నారు...
నెహ్రూ ను చాచ అన్నారు...
ఇంకా...గాంధీ ని తాత అన్నారు...
కానీ... నీకు వేరే పేర్లు అవసరం లేదు...
నీ అసలు పేరే నీ సిసలు పేరు...
నువ్వు సాక్షత్తు చంద్ర శేఖరుడువి
తెలంగాణ భూముల్లో నీరు పారించగల గంగా ధరుడివి...
తెలంగాణ ప్రజల మొక్కు తీర్చే భోలా శంకరుడుడివి...
తెలంగాణ ప్రజల కోసం, ప్రతిపక్షాల సూటి పోటీ మాటలు, హేళనను, విమర్శలను
అన్నింటిని నీ కంఠంలో దాచుకున్న్న నీలకoటుడు వి...
తెలంగాణ ధ్రోహుల పాలిట వీరభద్రుడువి...
నీకేం కాదు, నువ్వు మృతుంజయుడివి...
సాక్షత్ శక్తి స్వరూపుడువి...
నిజమయిన తెలంగాణ రత్నానివి...
తెలంగాణ పోరాటాన్ని నీ ఒక్కని నెత్తిన మోస్తున్న కలియుగ భీముడివి...పోరాట వీరుడువి...
నీ ధైర్యం , నీ తెగువ... కేసీర్...బహుపరక్ ...
నీకు లేడెవ్వడూ సాటి...రాడెవ్వడూ సాటి...
నీ ప్రతి మాటలో సత్తా ఉంది, ధమ్ము ఉంది, నిప్పు లాంటి నిజాలు ఉన్నాయి
తెలంగాణ బిడ్డల కష్ట-నష్టాలు తెలిసినవాడివి... వాళ్ళ మనసు ఎరిగిన మహారాజువి...
అన్ని లెక్కలు, అందరి లెక్కలు తెలిసిన అపర చాణక్యుడువి...
నీ మాట కడక్ , అదే ఈ దొంగ రియాల్టర్స్ కు జలక్..
నువ్వు ఏ భాషలో మాట్లాడిన, ఏ యాసలో మాట్లాడిన, నిన్ను మించినోడు లేడు...
నీకు సలాం కొడుతున్న...
అంత నువ్వే మాకు ...
మేమంత ఉన్నాం నీకు...
మనకు లేదు ఇక ఏదీ అడ్డు...
ఇంకా శాన వున్నదే చెశయ్యాల్సిందే...
మాకు నువ్వు కావాలే... నీ గొంతు కావాలే...నీ పంథా కావాలే...
ముందు ముందు నీ విశ్వరూపం చూస్తే, తెలంగాణ ద్రోహుల ఉ. పడాలి... బట్టలు తడవలే..పంచలు ఎత్తాలే, దౌడ్ తియ్యలే...
మనకే గనక తిక్క లేస్తే...రాయలసీమ ఫాక్షనిజం....కోస్తా ఆంధ్ర రాజకీయం దుమ్ము కొట్టుకుపోతాయి.
మూడు కోట్లన్నర తెలంగాణ బిడ్డల గొంతుకను నీ గొంతుతో ఈ దేశానికి వినిపించాలె...
కేసీఆర్...జిందాబాద్..
జై తెలంగాణ ... జై జై తెలంగాణ ...


-తెలంగాణ బిడ్డ

కేసీఆర్ ప్రెస్ మీట్

Friday, November 27, 2009

తెలంగాణ ఉద్యమ గీతం

ఉవ్వెత్తున ఎగిసింది ఉద్యమం మల్లి చూడు
విప్లవ చిరు జల్లుల్లు వీధి వీధిలల్ల జూడు ||ఉవ్వెత్తున||

రాజ్యాంగపు హక్కులుతో రాచరికం తిక్క కుదిరే
ప్రజాస్వామ్య గర్జనకు భూస్వాముల గుండెలదిరే
మ్రోగుతున్న డప్పులది ఆగదింక చప్పుడూ
వర్నకులాలకతీతంగా వర్ధమానమిప్పుడూ ||ఉవ్వెత్తున||

అమరవీరుల ఆత్మత్యాగం రక్తమై ఉడుకుతుంది
సత్యాగ్రాహమ్ము తోటి పల్లె నడుం బిగుస్తుంది
సాగుతున్న సమ్మెలతో పట్నం నిలబడ్డది
జిల్ల జిల్లల జనం నిద్రలేచి తిరగబడ్డది ||ఉవ్వెత్తున||

విద్యార్ధుల వీరాంగపు విద్ధ్యుత్తే ఇంధనమై
రైతన్నల కన్నీళ్ళే మండే అగ్గితునకలై
కార్మికుల కష్టాలే కదులుతున్న చక్రాలై
ఉరుకుతుంది బండి మనది ఆపేవాళ్లింక ఎవరు? ||ఉవ్వెత్తున||

తెలంగాణ నినాదాలు నింగిదాక వినబడాలే
తెలంగాణ జెండాలు జగమంత కనబడాలే
తెలంగాణ వచ్చే దాక చావుకైనా సిద్ధమ్మే
తెలంగాణ వచ్చే దాక చావుకైనా సిద్ధమ్మే ||ఉవ్వెత్తున||

-సిద్దార్థ పాములపర్తి

Thursday, November 26, 2009

కదిలిందిరా ఉస్మానియా ! ఖబర్దార్ ఖబర్దార్ !!

సిద్దిపేట పోలీసుల జై తెలంగాణ

సిద్దిపేట లో కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేయడానికి తరలించిన పోలీసు బలగాలు జై తెలంగాణ నినాదాన్ని అందుకున్నాయి. సిద్దిపేట మార్కెట్ యార్డ్ లో బస చేస్తున్న పోలీసులను చూడటానికి స్థానిక ఎం ఎల్ ఏ, తెలంగాణ రాష్ట్ర సమితి యువ కిశోరం హరీష్ రావు వచ్చిన సందర్భం లో ఈ సంఘటన జరిగింది. వేలాది గా తరలి వచ్చిన పోలీసులకు భోజన సదుపాయం కల్పించలేక పోయిన పోలీసు బాసులు వీరినందరిని స్థానిక మార్కెట్ యార్డ్ కు తరలించారు.

అయితే అప్పటికే ఆకలి తో నకనక లాడుతున్న పోలీసులను ఉద్ధేశించి హరీష్ మాట్లాడుతూ మీరు మా అతిథులు, మేము మీకు భోజన సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పినప్పుడు పోలీసులంతా ముక్త కంఠం తో జై తెలంగాణ అని నినదించారు. వీరికి హరీష్ ఒక విజ్ఞప్తి చేస్తూ మీరు మీ డ్యూటీ చేయండి కానీ లాటి ఛార్జ్ లాంటివి చేయాల్సి వస్తే కింద నేల పై కొట్టమని కోరారు. అలాగే కింది స్థాయి పోలీసులకు తెలంగాణ వస్తేనే మంచిది అని ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను వివరించారు.

దీనితో ఒకటి చేయ తలచి భారీ బలగాలను దించితే ఇంకోటి జరిగింది పోలీసు అధికారులు తలలు పట్టుకున్నారు.

కేసీఆర్ నివాసంలో అయ్యప్ప పూజ

నేడు కేసీఆర్ కరీం నగర్ నివాసంలో అయ్యప్ప పూజ నిర్వహిస్తున్నారు. 500 స్వాముల ఆధ్వర్యంలో ఈ పూజ ను ఘనంగా నిర్వహిస్తున్నారు. 144 సెక్షన్, 30 పోలీస్ ఆక్ట్ (ఎవరినైనా ఎక్కడైనా అరెస్ట్ చేసే చట్టం)అమలులో ఉన్న నేపథ్యం లో కరీం నగర్ నుంచి దీక్షా శిబిరమైన సిద్దిపేట తరలి వెళ్ళటం దాదాపు అసాధ్యం అని పోలీసులు భావిస్తున్నారు. ఇంటి నుంచి అడుగు బయాట పెట్టగానే అరెస్ట్ చేస్తామని పోలీసులు అంటుంటే, ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడే దీక్ష ప్రారంభిస్తారని కేసీఆర్ తనయుడు రామారావు చెప్పారు.

నిన్నటి నుంచి కేసీఆర్ నివాసం లో సర్వ మత ప్రార్థనాలు జరుగుతున్నాయి. కేసీఆర్ ముందుగా సిక్కు మత ప్రార్థనలు, ఆ తరవాత క్రైస్తవ మత పెద్దల దీవెనలు అందుకున్నారు. ఈరోజు మధ్యాన్నం దగ్గర్లోని దర్గా కి వెళ్ళి వచ్చే అవకాశాలున్నాయి.

మీడియా తో ఇదే చివరి సారేమో !

తలసాని ప్రగాల్బాలు పారలేదు

తనను తాను ఎక్కువగా ఊహించుకునే లష్కర్ ఉత్తర కుమారుడు గ్రేటర్ ఎన్నికల లో కుదేలైపోయాడు. సెట్లర్ల కు అండగా ఉంటాను,ఏ సమయన్నైనా నాకు ఫోన్ చేయొచ్చు, కేసీఆర్ ఇల్లు ఖాళీ చేయిస్తాను అని బీరాలు పలికిన తలసాని ఆలుగడ్డ శ్రీనివాస్ యాదవ్ కు సికింద్రా బాద్ ప్రజలు తల బొప్పీ కట్టించారు.

ఒక పక్క శివారు ప్రాంతాల్లో తెలుగు దేశం తన ఉనికి ని చాటుకోగా సికింద్రాబాద్ లో మాత్రం దాదాపు అన్ని స్థానాలలో ఓడిపోయింది. ఆరు నెలల క్రింద జరిగిన శాసన సభ ఎన్నికల లో నాన్ లోకల్ అయిన జయసుధ చేతిలో దెబ్బయి పోయిన తలసాని కి తలబిరుసు ఏ మాత్రం తగ్గలేదు.తెలంగాణ పదం ఎవరు ఉచ్చరించినా ఇల్లెత్తు ఎగిరే తలసాని కి గ్రేటర్ ఫలితాల ద్వారా తగిన శాస్తి జరిగింది అని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.

దున్న పోతు - జీవన్ రెడ్డి

బక్క పలచ గా ఉన కేసీఆర్ ను కాకుండా దీక్షలో మధు యాష్కీ ని కూర్చోమని ఎద్దేవా చేసిన జీవన్ రెడ్డి పై కేసీఆర్ నిప్పులు చిమ్మారు. మధు యాష్కీ ని దున్నపోతు తో పోల్చుతూ వ్యాఖ్య చేసిన జీవన్ రెడ్డి ని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ నువ్వు కూడా దున్నపోతు లాగా ఉన్నావు, నువ్వూ తెలంగాణ లో పుట్టి నోడివే కదా నువ్వు వచ్చి దీక్ష లో కూర్చోమని సూచించారు.

ఒకప్పుడు కరీం నగర్ జిల్లా లో ఎదురులేని నాయకుడు గా చలామణి అయిన జీవన్ రెడ్డి మొదట తెలంగాణ పల్లవి ని ఎత్తుకున్న వారిలో ఒకరు. తెరాస ఆవిర్భావం తో మరుగున పడ్డాడు. వైఎస్ కాంపులో దూరిన తరవాత రెచ్చిపోయి కేసీఆర్ తో తలపడ్డారు. ప్రతీసారి మట్టి కరుస్తూ పోయారు. దీనితో తెలంగాణ అన్నా తెలంగాణ కోరేవాళ్ళన్నా జీవన్ రెడ్డి కి మంట. సొంత పార్టీ లో తెలంగాణ పై గళమెత్తే యువ నాయకుడు మధు యాష్కీ పై ఈ మధ్య సమయం దొరికినప్పుడల్ల అక్కసు ను చూపిస్తున్నారు.

దున్నపోతు మీద వాన చందాన గత అరవై ఏళ్లుగా తెలంగాణ పై మోసగిస్తూ వస్తున్న కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున జీవన్ రెడ్డి దున్నపోతా, లేక అలాంటి పార్టీ లోనే ఉంటూ తెలంగాణ పై మడమ తిప్పకుండా మాట్లాడుతున్న మధు యాష్కీ దున్న పోతా తేల్చుకోవాల్సింది తెలంగాణ ప్రాంత ప్రజలే.

జయ జయహే తెలంగాణ - అందెశ్రీ విరచిత తెలంగాణ రాష్ట్ర గీతం

Wednesday, November 25, 2009

అష్ట దిగ్బంధంలో సిద్ధిపేట

మెతుకు సీమ ముఖ్య పట్టణం, తెలంగాణ పోరు గడ్డ సిద్ధిపేట నేడు అష్ట దిగ్బంధనం లో ఉంది. దీక్ష రోజైన ఇరవై తొమ్మిది కి ఇంకా మూడు రోజులు ఉండగానే సిద్ధిపేటలో ఆరు వేల పోలీసులను మోహారించారు. రాయలసీమ కు చెందిన ఒక ఐజీ ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో ఎస్పీ లు, వందల సంఖ్యలో ఇన్‌స్పెక్టర్లు, వేల సంఖ్య లో పోలీసులను దించారు. సిద్ధిపేట కు ఎనిమిది దిక్కులా అన్ని దారులు మూసివేశారు. పట్టణం లో 144 సెక్షన్ తో పాటు పలు నిషే దాజ్ఞలు విధించారు.

ఇది ఇలా ఉంటే ఆరునూరైన నిరాహార దీక్ష లో కూర్చుని తీరుతానని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అనితర సాధ్యమైన వ్యూహాలను రచించే సామర్థ్యం ఉన్న కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు కు ఇది పరీక్షా సమయం. పోలీసులను బురిడి కొట్టించడానికి చివరి నిమిషం లో దీక్షా వేదిక ను మార్చిన ఆశ్చర్యం లేదు. రెండు రోజుల ముందు కరీం నగర్ కు బయలు దేరి వెళ్తున్న కేసీఆర్ హైదరాబాద్ లో మీడియా తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రోశయ్య డీజీపీ గిరీష్ కుమార్ పై నిప్పులు కురిపించారు.

ఏది ఏమైన నేడు దేశం మొత్తం కాకుండా ప్రపంచం లో ఉన్న తెలుగు వారు అంతా నేడు సిద్ధిపేట వైపు చూస్తున్నారు.

Candle Light Vigil by TeNA & TITF for Telangana

కేసీఆర్ ఆమరణనిరాహార దీక్ష సందర్భంగా పాలిట్ బ్యూరో సమావేశం తరవాత విలేఖరుల సమావేశం







తెలంగాణ: దుస్థితి - దౌర్భాగ్యం

తెలంగాణ అర్థ శతాబ్ధంగా ఒక బ్రహ్మ పదార్థం. ఒక త్రిశంకు స్వర్గం. పాలకులు సాగిస్తున్న అడుగడుగు మోసాలకు సజీవ సాక్ష్యం తెలంగాణ. భాష, యాస, బతుకుల మీద సాగుతున్న అహంకార, అభిజాత్య, ఆధిపత్య ధోరణులకు నిలువెత్తు నిదర్శనం తెలంగాణ.

ఏ రంగం చూసుకున్న అన్నింటిలో వెనకబడి ఉంది నేటి తెలంగాణ. ప్రభుత్వ, ప్రైవేటు, సినిమా, మీడియా... ఇలా అన్ని రంగాలలో ఒక ప్రాంతం వారి ఆధిపత్యమే. వారు చెప్పిందే వేదం, అదే ప్రామాణికం. ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి, వ్యాపార వేత్తలు ఎందరో వచ్చినా సొంత ప్రాంతానికి ప్రత్యేకంగా ఒరగబెట్టింది ఏమీ లేదు. మూడున్నర కోట్ల జనాభా ఉన్నా ఒక్కటంటె ఒక్క పత్రిక లేదు, పుట్టగొడుగుల్లాగా పుట్టుకు వస్తున్న చానల్స్ లో ఒక్కటంటె ఒక్కటి కూడా లేదు.

ఇది అవతలి వాళ్ళ గొప్పతనం కన్నా ఈ ప్రాంతం వారి చేతకాని తనమే ఎక్కువ. ఆ కొరత ను కొంతలో కొంత అయినా తీర్చాలనే తలంపుతో మొదలు పెడుతున్న ప్రయత్నమే ఈ బ్లాగ్. ఆశీర్వదించండి...
-భూమి పుత్ర